Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రాజమండ్రిలో ఘనంగా నవరాత్రి వేడుకలు.

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక దేవీక్‌లోని దుర్గాదేవి ఆలయంలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి వేళల్లో…

తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కృష్ణా: నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో తల్లి మందలించిందని ఆరోతరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదల

విశాఖ,  ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టీడీపీ నేతలను అప్పగించారు.టీడీపీ నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు.…

ప్రత్యర్థుల దాడిలో గాయపడిన రాఘవరెడ్డి మృతి

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన రాఘవరెడ్డి మృతి చెందారు. మెరుగైన చికిత్స నిమిత్తం పెద్దాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రత్యర్థులు టిప్పరుతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి…

వైభవంగా రెండో రోజు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ,  : విజయవాడలో రెండోరోజు దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. శ్రీశైలంలోనూ నేడు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి దర్శనమిచ్చారు.

కర్నూలు జిల్లా ఆలయంలో చోరీ

కర్నూలు,: కర్నూలు జిల్లా పత్తికొండలోని హోసూరు వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుండీని పగులగొట్టి నగదు, 60 తులాల వెండిని అపహరించారు.

రేపు ’108’లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

గుంటూరు (మెడికల్‌): 108 ఆంబులెన్స్‌ వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈంటీ), పైలెట్‌ (డ్రైవర్‌) పోస్టుల ఎంపిక కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అక్టోబర్‌ 15వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక…

ఆర్థికసమస్యలతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

 ప్రకాశం, : జిల్లాలోని వేటపాలెం మండలం చేనేతపురిలో కె. సుబ్బయ్య (50) అనే చేనేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోవటంతోపాటు ఆర్థిక సమస్యలతోనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారని తోటి కార్మికులు చెప్పారు. ఈ…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రీద్ద సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు గంట, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,185 మంది భక్తులు…

తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్‌లో 8చోట్ల బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి రైల్వేస్టేషన్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే…