Wednesday, 25 November 2026

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగల పట్టివేత

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో అటవీశాఖ, ప్రత్యేక కార్యదళం సంయుక్త దాడులు నిర్వహించాయి. 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసిన పోలీసులు రూ.15లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం… మహిళ మృతి

నెల్లూరు నేరవిభాగం: నెల్లూరు ఇరగాళ్లమ్మ సంఘంలో బుధవారం విద్యుదాఘాతంతో 6 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇరగాళ్లమ్మ దేవస్థానం సమీపంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు…

ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు.

చిత్తూరు : తిరుపతి బస్టాండులో ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బస్సులోనే నిద్రిస్తున్న డ్రైవర్‌ కండక్టరుకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. జగన్‌ దీక్ష భగ్నానికి నిరసనగా వైసీపీ కార్యకర్తలే…

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రామగానిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని కురబలకోట మండలం గట్టమీదపల్లికి చెందిన ఫిజియోథెరపీ నిపుణుడు మదన్‌మోహన్‌రెడ్డి (25)గా గుర్తించారు. మదన్‌మోహన్‌రెడ్డి బైక్‌పై…

కూంబింగ్ నిలిపివేయాలి.. లేదంటే బందీలకు ఏం జరిగినా మీదే బాధ్యత’

విశాఖపట్నం,  ఏవోవీలో కూంబింగ్ నిలిపివేయడంతో పాటు రెండురోజుల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని మావోయిస్టు పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలా చేయనిపక్షంలో తమ దగ్గర బందీలుగా ఉన్న నేతలకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని…

ఆమరణ దీక్ష చేపట్టిన వ్యక్తికి బీపీ, షుగర్‌తో పనేంటి’

హైదరాబాద్,  జగన్ దీక్ష కుర్చీకోసం తప్ప ప్రజల కోసం కాదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జగన్‌కు బీపీ, షుగర్‌తో పనేంటని…

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

గజపతిపురం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం దత్తరాజుపాళెంలోని పొనలి జంక్షన్‌లో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. చీపురుపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తినాయుడు(30) రహదారిపై విగతజీవుడై పడి ఉండటాన్ని స్థానికులు సోమవారం ఉదయం…

కర్నూలు కలెక్టరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌,  కర్నూలు జిల్లాలోని బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.‘‘మీ పిల్లలు ప్రభుత్వ బాలికల స్కూళ్లలో చదవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారా ? ’’ అంటూ హైకోర్టు కర్నూలు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం…

నర్సాపురంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

 పశ్చిమగోదావరి, : జిల్లాలోని నర్సాపురం రైల్వేస్టేషను రోడ్డులో కమల అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించారు. భర్తే కమలను చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు ఆరంభించారు. కమలది హత్య అని పోలీసులు…

విశాఖ బీచ్‌లో కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు

విశాఖ, : విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో మూడు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. నిన్న బీచ్‌లో రోహిత్‌, జబ్బార్‌, తారీఖ్‌లు గల్లంతయ్యారు. తారీఖ్‌ యూపీ వాసి. నిన్న ఆర్‌కే బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.