Tuesday, 24 November 2026

సీమాంధ్ర

వరద ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన రాకపోకలు

తూర్పుగోదావరి: జిల్లాలోని దేవిపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వరద ఉద్ధృతి కారణంగా ఇప్పటికే 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవిపట్నంలోని జాలర్‌పేట, ఎస్సీకాలనీ, పోచమ్మగండి వద్ద 10 ఇళ్లు నీటమునిగాయి.

శ్రీవారిని 52,408 దర్శించుకుంటున్న భక్తులు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటలు, కాలినడకన వచ్చిన యాత్రికులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 52,408…

44వ జాతీయ రహదారిలో డివైడర్‌ను ఢీకొన్న కారు

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు 44వ జాతీయ రహదారిలో డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశం…

పోలింగ్‌ కేంద్రం పై రాళ్లదాడి

గుంటూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపాలెంలో స్థానికులు బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేసి, పోలింగ్‌ కేంద్రాలపై రాళ్లు వర్షం కురిపించారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

గుంటూరు,(జనంసాక్షి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతి భద్రతలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పంచాయతీలకు ఆగష్టు న ఎన్నికలు నిర్వహించనున్నారు.

జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టిన విద్యార్థులు

ఎచ్చర్ల (శ్రీకాకుళం):బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఎచ్చర్లలో తరగతులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై ర్యాలీ, అందోళన చేపట్టారు. అంతకు ముందు వర్సిటీ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అచార్యులు తులసీరావ్‌,…

భారీ వర్షం కారణం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వరదనీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం తర్వాత దిగువకు నీరు విడుదల చేసే అవకాశముంది. దీంతో శ్రీశైలం జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తూబాడులో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రం మార్పుపై అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూబాడులో స్థానికులు జిల్లా కలెక్టర్‌ను చుట్టుముట్టినట్లు సమాచారం.

భారీ ర్యాలీ చేపట్టిన సమైక్యవాదులు

అనంతపురం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీ ఎన్జీఓ, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, విద్యార్థి, న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఎంపీ అందుబాటులో లేకపోవడంతో అయన తమ్ముడు చంద్రారెడ్డికి…

లగడపాటి నివాసం ముట్టడించిన ఏపీఎన్జీవో

కృష్ణా జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నివాసాన్ని ఏపీఎన్జీవోలు ముట్టడించారు. రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.