జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. అనంతరం విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై మానవహారం చేశారు.
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. అనంతరం విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై మానవహారం చేశారు.
తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంపీలు శివప్రసాద్, చింతామోహన్ ఇళ్ల ముట్టడికి ఉపాధ్యాయ, విద్యార్థి, పింఛన్‌దార్ల ఐకాస ఈ ఉదయం యత్నించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా: సూరారెడ్డిపాలెం రైల్వేగేట్ వద్ద పినాకిని ఎక్స్‌ప్రెస్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. ఈ ప్రమాదంతో పినాకిని ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలును నిలిపివేసి రైల్వే అధికారులు మరమత్తు పనులు చేపట్టారు.
విజయవాడ, ఎన్టీఆర్ అరోగ్య విశ్వవిద్యాలయం: సిద్ధార్థ వైద్యకళాశాలలో ప్రారంభం కావాల్సిన పీజీ వైద్యుల నియమకాల కౌన్సెలింగ్‌ను జూనియర్ డాక్టర్లు అడ్డుకున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన జూనియర్ డాక్టర్లు శాశ్వత ప్రాతిపదికన నియమకాలు చేపట్టాలని అందోళన చేస్తున్నారు.
విశాఖ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎస్‌జీవో, విద్యార్థి ఐకాస నాయకులు కేంద్ర మంత్రి పురందేశ్వరి నివాసాన్ని ముట్టడించారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
కడప, నేరవిభాగం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ సాయిప్రతాప్ నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస, ఎన్జీవో నాయకులు ఈ ఉదయం ముట్టడించారు. సాయిప్రతాప్ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఐకాస కన్వీనర్ రవిశంకర్‌రెడ్డి,…
కర్నూలు: కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,36,610 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,36,900…
కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పలువురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో స్థానికేతరుల ఓటర్లు వివాదం ఘటనకు సంబంధించి వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. చార్ మజుందార్ వర్థంతి సందర్భంగా ప్రతి ఏటా జులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తుంటారు. శనివారం ఎనోబీ సరిహద్దుల్లో తూర్పు డివిజన్…
గుంటూరు: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పల్లెల్లో ఎలాంటి పారదర్శక పాలన అందిందో ప్రజలు ప్రత్యక్షంగా చూపించినందునే…. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ తమ పార్టీ మద్దతు దారులకు పట్టం కట్టారని తెదేపా ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర…