Tuesday, 24 November 2026

సీమాంధ్ర

విశాఖలో బారీ పేలుడు పదార్థాలు స్వాదీనం

విశాఖ : జిల్లాలోని రోలుగుంటలో బారీగా అమ్మెనియం నైట్రేట్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌, 1500 డిటోనేటర్లు, 200 జిలెటెన్‌ స్టిక్స్‌ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని…

ఏసీబీ వలలో చిక్కిన రాయదుర్గం ఏడీఈ

అనంతపురం,(జనంసాక్షి): రైతు నుంచి లంచం తీసుకుంటూ రాయదుర్గం ఏడీఈ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 6 వేల లంచం తీసుకుంటూ ఏడీఈ ప్రసాద్‌, ఆపరేటర్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

వాతావరణ అనుకులించకపోవటంతో విమాన సర్వీసులకు ఆటంకం

కోరుకొండ, తూర్పుగోదావరి: రాజమండ్రి -హైదరాబాద్‌ విమాన సర్వీసులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆటంకం కల్గించాయి. రాజమండ్రి -హైదరాబాద్‌ స్పైన్‌జెట్‌ విమానం రాజమండ్రి నుంచి సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసును…

కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంచి నిర్ణయం తీసుకోవాలన్న తెదేపా నేత సోమిరెడ్డి

నెల్లూరు: రాష్ట్రం విడిపోతే మరో జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలుగా మారుతుందని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతో పునఃసమీక్షించుకుని, తెలుగువారికి ప్రయోజనం కలిగే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆకివీడులో రూ. 13.50లక్షల స్వాధీనం

ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు చేసిన తనిఖీల్లో రూ. 13.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై యార్లగడ్డ రవికుమార్‌ ఇచ్చిన వివరాల మేరకు కృష్టాజిల్లా…

అక్రమంగా తరలిస్తున్న రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాతపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 166 మద్యం సీసాలను ఎక్సైజ్‌…

60 కాసుల బంగారాన్ని అపహరించిన దుండగులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న జీటీపీ టవర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. కొల్లి సత్యశ్రీకి చెందిన నివాసంలో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దొంగ సుమారు 60 కాసుల బంగారాన్ని అపహరించాడు.…

కారులో రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐ

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ. 10లక్షలు పట్టుబడ్డాయి. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ బి. వెంకటేశ్వరరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న కారులో…