Tuesday, 24 November 2026

సీమాంధ్ర

60క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నర్సాపురం: మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద పట్టుకున్నారు. రూ. 1.68లక్షల విలువైన బియ్యాన్ని కృష్ణాజిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తుండగా నర్సాపురం బస్టాండ్‌…

ఆయిల్‌ ట్యాంకర్‌ను లారీ ఢీ: ఒకరి మృతి

వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలం విఠల్‌ రాజుపల్లి వద్ద అగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌ పక్కన కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు…

అగ్ని ప్రమాదం వల్ల వంద పూరి పాకలు దగ్ధం

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానాన్ని అక్రమించుకుని ఏర్పాటు చేసిన వంద పూరి గుడిసెలు బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి…

అగ్ని ప్రమాదం వల్ల గల్లా పుడ్స్‌ దగ్ధం

పూతలపట్టు (చిత్తూరు): పూతలపట్టు మండలం రంగంపేట వద్ద ఉన్న గల్లాపుడ్స్‌ పరిశ్రమంలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 700 టన్నుల మామిడి తాండ్ర దగ్ధమైంది. నష్టం విలువ రూ. 1.5కోట్లు ఉంటుందని…

రెండు లారీలు ఢీకోనడంతో డ్రైవర్‌ పరిస్థితి విషమం

రామలక్ష్మణ కూడలి(శీకాకుళం): సింగ్‌పురం వద్ద జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. హైవే సిబ్బంది, 108సిబ్బంది, స్థానికులు రెండుగంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వాధికారి

గుంటూరు,(జనంసాక్షి): రూ. 10వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఓ ప్రభుత్వాధికారి. నరసరావుపేట అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న జాషువాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తా: రాయపాటి

గుంటూరు : రాష్ట్రాన్ని విభజిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తాను ముమ్మాటికీ సమైక్య వాదినేనని, రిఫరెండం పెడితే సమైక్య రాష్ట్రానికే ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

ప్రైవేటు పాఠశాలల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ

కడప : కడప జిల్లాలోని 20 ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం నాలుగు విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అధిక ఫీజులు, గుర్తింపులేని పాఠశాలలు, సౌకర్యాలు లేమిపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

శ్మశానవాటికలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

తిరుమల,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం తిరుమల శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్థానికులను తిరుమల నుంచి ఖాళీ చేయించే కార్యాక్రమాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తిరుమల స్థానికులదే…

శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేతలు

తిరుపతి,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి సన్నిధిని రాష్ట్ర బీజేపీ నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన నేతలు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు…