Tuesday, 24 November 2026

సీమాంధ్ర

కేంద్రమంత్రి కావూరి స్వాగత యాత్రలో అపశ్రుతి

గన్నవరం,(జనంసాక్షి): కేంద్రమంర్రతి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలి ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో…

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

కడప,(జనంసాక్షి): గోపవరం మండలం అడుచువారి పల్లె వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

భారీగా గంజాయి పట్టివేత

విజయవాడ : స్థానిక బెంజిసర్కిల్‌ వద్ద పెద్ద ఎత్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. ఫోర్డ్‌ ఐకాస్‌ కారులో గంజాయి తరలిస్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుని కారుతో పాటు, నిందితులను కూడా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేతలు

తిరుమల : తిరుమల శ్రీవారిని భాజపా నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నేతలు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు…

అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటం బహుకరణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువైన దానేశ్వరి అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటాన్ని భక్తులు బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన వర్మ కుటుంబీకులు ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ…

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు కన్నుమూత

ఏలూరు,(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరంలోని అన్నవరంలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం గుండెపోటుతో కన్ను మూశారు. పీవీ నరసింహరాజు భీమవరం నుంచి…

కళాశాల బస్సు బోల్తా…. విద్యార్థులకు గాయాలు

కామవరపుకోట (పశ్చిమగోదావరి): జూనియర్‌ కాలేజీ బస్సు మంగళవారం ఉదయం బోల్తా పడి దాదాపు 20మంది విద్యార్థులు గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల సమీపంలో ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన ఎలైట్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజి బస్సు…

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివార్లలో మూడేళ్లబాలుడు హర్షిత్‌రెడ్డి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అగ్రహించిన బంధువులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో మార్కాపురం వద్ద రహదారిపై భారీగా వాహనాలు…

10 కిలోల గంజాయి స్వాధీనం

ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు నిర్వహించి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ…

కిడ్నాపర్ల చేతిలో హర్షిత్‌ రెడ్డి హత్య

ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివారులో మూడేళ్ల బాలుడు హర్షిత్‌ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బుకోసం దుండగులు నిన్న తెల్లవారు జామున హర్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశారు. రూ. 7లక్షలు ఇవ్వాలని లేక పోతే…