Tuesday, 24 November 2026

సీమాంధ్ర

డీఈఓను నిర్భంధించిన ఎమ్మల్యే సోదరుడు

అనంతపురం: పట్టణంలోని వివాదాస్పద మిస్సమ్మ స్థలంలో అనుమతి లేని పాఠశాలను మూసివేసేందుకు డీఈఓ యత్నించారు. దీంతో డీఈఓను స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అడ్డుకున్నారు. తాను చెప్పినట్లు నివేదిక రాయలని డీఈఓను నిర్బంధించారు. ఎర్రిస్వామిరెడ్డి అనుచరులు డీఈఓ రాసిన…

తెదేపానేత యనమలకు గాయాలు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తొండంగా మండలం పెరుమల్లాపురం దుర్గమ్మ అలయం వద్ద తెదేపా సీనియర్‌నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మెట్లపై నుంచి జారిపడ్డారు. కాలికి గాయం కావడంతో 3వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

చినకాకానిలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

గుంటూరు: గుంటూరు జిల్లా చినకాకానిలోని ప్రైవేటు వైద్య కళాశాలలో విద్యార్థి వంశీకృష్ణ అత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు అందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు పరామర్శించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో…

వంద బస్తాల చౌకబియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన వంద బస్తాల చౌక ధర బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు.

ఉద్ధృతమవుతున్న నాగావళి నీటి ప్రవాహం

శ్రీకాకుళం: ఒడిశాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నదికి నీటి ప్రవాహ తీవ్రత పెరిగింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం తొలి హెచ్చరిక జారీ చేసింది. మరోపక్క నాగావళి నదిపై కొత్త వంతెన కూల్చివేత…

నలగాంపల్లిలో అగ్నిప్రమాదం

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి వద్ద ఉన్న కేఎస్‌ఎస్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ. 2కోట్ల విలువైన మామిడికాయలు, వాటిని నిల్వ ఉంచిన షెడ్లు కాలిపోయాయి. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది…

బాపట్లలో వికలాంగుల నిరసన

గుంటూరు : వైకాపా నేత, మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వర్గీయులకు వ్యతిరేకంగా బాపట్లలో వికలాంగులు నిరసనకు దిగారు. బాపట్లలో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన వికలాంగులను ఉమ్మారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు అందోళనకు దిగారు.

భూదాన ఉద్యమ భూముల్లో ఇళ్లు తొలగింపు

కృష్ణా: కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన ఉద్యమ ట్రస్ట్‌ భూముల్లో ఇళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.

పాఠశాల భవనాలు తనిఖీ చేయాలని మంత్రి ఆదేశం

అనంతపురం: పాఠశాల భవనాలు తనిఖీ చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రాథమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై ‘ఈటీవీ’లో ప్రసారమైన కథనానికి స్పందించిన మంత్రి ఈమేరకు ఈమేరకు అదేశాలు జారీ చేశారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి,(జనంసాక్షి): విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తగ్గింది. 12 కంపార్ట్‌మెట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దక్శనానికి 2 గంటల…