Monday, 23 November 2026

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖ: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వానలు, ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు…

పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

విజయనగరం: జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టామి, దీంతో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.

విశాఖ నుంచి గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ యథాతథం

విశాఖ: విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గరీభ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రోజు యధావిధిగా నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు.…

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: కిషన్‌రెడ్డి

రాజమండ్రి: వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. నీలం తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి…

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబు

్ణకృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు…

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబ్ణు

కృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు…

ఘపనంగా సత్యసాయి సంగీత విభావరి .

పుట్టపర్తి : సత్యసాయి 87వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి భవన మండలి సభ్యులు సంగీత విభావరి  ననిర్వంహంచారు. అదివారం  స్థానిక ఆంసజనేయస్వామి దేవాలయయంలో సత్యసాయి  భజన మండలి మందిరంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఆరు గంటల…

తూర్పుగోదావరి జిల్లాలో రేపు సీఎం పర్యటన

కాకినాడ: జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటించనున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలియజేశారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ఆయన వివరించారు. 395 పక్కా ఇళ్లు, 400…

800 ఎకరాల్లో ముంపునకు గురయిన తమలపాకు తోటలు

విశాఖపట్నం: పాయకరావుపేట మండలంలోని భూమి. ముఠా ఆనకట్లలకు గండ్లు పడ్డాయి. వరద కారణంగా ఇద్దరు మృతి చెందారు. 800 ఎకరాల్లో తమలపాకు తోటలు ముంపునకు గురయ్యాయి. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పర్యటించలేదు. విశాఖ జిల్లా…

సహాయం కోసం 5 వేల మంది ఎదురుచూపు

విశాఖపట్నం: విశాఖ జిల్లా మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. 5 వేల మంది బాధితులు సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు.