Monday, 23 November 2026

సీమాంధ్ర

ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

  తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు

కర్నూలు: ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్థంగా తిరుగుతున్న 4 ప్రైవేటు బస్సులను జప్తు చేశారు. తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరులకు వీటిని అనుమతి  లేకుండా తిప్పుతున్నారని తెలియజేశారు. అధిక…

చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం

ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్‌ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభంలో విద్యార్థులు గిరిజన మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి…

మలాలాపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన టీనేజీ బాలిక మలాలాపై దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలాలా యూసుఫ్‌జాయ్‌ అనే 14ఏళ్ల బాలికపై గత మంగళవారం తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే. మిలటరీ ఆస్పత్రిలో ఆమెకు…

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో గత మూడు రోజులుగా ఉనబై రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్‌లోకి కొనసాగింది. నిన్న రాత్రి నుంచి ఎగువ జూరాలకు…

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్యలు:కిశోర్‌చంద్రదేవ్‌

  రాజమండ్రి: అటవిప్రాంతంలో గిరిజన చట్టాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పందాలు జరుగుతున్నాయని కేంద్ర గిరిజన సంక్షేమమంత్రి కిశోర్‌ చంద్ర అన్నారు. రంపచోడవరంలో పర్యటనలో భాగంగా ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాలున్న 9రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే…

ఢిల్లీలో బేరసారాల కోసమే వైకాపా వ్యాఖ్యలు:బాబు

అనంతపురం: అవిశ్వాస తీర్మాణం ఎప్పుడు పెట్టాలో తెలియకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ప్రభుత్వంపై తాము ఎప్పుడు అవిశ్వాస తీర్మాణం పెడితే ఢిల్లీకి వెళ్లి బేరాలు చేసేందుకే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ…

అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య

కడప: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకునిపై చర్యలు తీసుకోవాలని…

చంద్రబాబు పాదయాత్ర

  అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 11వ రోజు ఉరవ కొండ మండలం నింబగల్లులో ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు రేణుమాకులపల్లికి చేరుకుని గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

స్కాట్‌లాండ్‌లో గుంటూరు జిల్లా వాసి కాల్చివేత

గుంటూరు: ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్న మలినేని దిలీప్‌(27) అనే యువకుడు ప్రేమ వివాదంలో తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఈ నెల 5న స్కాట్‌లాండ్‌లో జరిగింది. దిలీప్‌…