Sunday, 22 November 2026

Main

ఏసీబీ వలలో అవినీతి చేప

కరీంనగర్: జిల్లాలో మార్కెట్‌కమిటీ కార్యదర్శి కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గుర్తించిన అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి

కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన ‘పొలిపాక గట్టయ్య’ అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్‌ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్‌ గ్రామానికి చెందిన పొడగరి గట్టయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గట్టయ్య…

జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన…

సింగరేణి రీజియన్ లో భారీ వర్షం..

కరీంనగర్: జిల్లాలోని రామగుండం సింగరేణి రీజియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆర్జీ 1, 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల

కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు

జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర

కరీంనగర్‌, మే 12: జిల్లాలోని జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో ధర పలికింది. అత్యధికంగా క్వింటాలుకు రూ.4760 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. మోడల్‌ ధర రూ.4600 కాగా,…

అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి

 కరీంనగర్ : తమను నిత్యం వేధిస్తూ.. బాధ్యత లేకుండా వదిలేసి బలాదూర్‌ తిరుగుతున్న పెద్దమనిషిని కుటుంబసభ్యులే ఉతికి ఆరేశారు. భార్యా, పిల్లలను వేధించడమే కాక.. మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్ని అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగించారు. ఆగ్రహంతో ఊగిపోతూ..…

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 

కరీంనగర్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, 30 కిలోల వెండీ, రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.