Wednesday, 25 November 2026

వార్తలు

బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సన్యాసుల ప్రదర్శన

బ్యాంకాక్‌: మహాబోధి అలయంలో భద్రతను పెంచాలంటూ బౌద్ధ సన్యాసులు బ్యాంకాక్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు, భారత ఎంబసీ ముందు బుధవారం ప్రదర్శన చేపట్టారు. దాదాపు నాలుగు వందల మంది బౌద్ధ సన్యాసులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం…

ఏసీబీ వలలో చిక్కిన ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం వక్స్‌ బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు…

సీఎంతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో సచివాలయంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖామంత్రి బొత్స సత్య నారాయణ, ఆర్థిక మంత్రి అనం రాం నారాయణరెడ్డి, ప్రాథమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిలు భేటీ అయ్యారు.

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిందేవి వెంకటరమణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

బోనాలు, రంజాన్‌ పండుగల సందర్భంగా భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో బోనాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఇవాళ ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు చోటు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటాయన్నామని…

పాత భవనాలను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్‌.పి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేశారు. చింతలబస్తీ, గస్‌ఫౌండ్రీ, బంజారాహిల్స్‌, రోడ్‌ నంబర్‌ 4,…

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు: ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. తాజాగా చమోలీ జిల్లా బిఖూలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. కొండ చరియల కింద మరికొందరు…

విరిగిపడిన కొండచరియలు

ముంబయి: ముంబయి నగరంలోని యాంటాప్‌ హిల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురిని కాపాడారు. మరో ఐదుగురు విరిగిపడిన కొండ చరియల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. బీఎంసీ ఆధ్వర్యంలో 40మంది…

చెక్‌పోస్ట్‌ వద్ద భారీ నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 18లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ప్రయాణిస్తుస్తున్న కారును పోలీసులు సీజ్‌ చేశారు.