Wednesday, 25 November 2026

వార్తలు

ఆర్టీసీ సమస్యలపై సమావేశం నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వైకాపాలో హంతకులు, రౌడీలే ఉన్నారు :వీహెచ్‌

హైదరాబాద్‌: వైకాపా నిజ స్వరూపం బయటపడిందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. హంతకులు, రౌడీలే ఆ పార్టీలో ఉన్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తెలంగాణ విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఖరిలో మార్పు కనిపిస్తోందని…

ఎంపీ పొన్నం ఇంట్లో సమావేశమైన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో మధుయాష్కీ, ఆనంద్‌ భాస్కర్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించిన షిండే

బీహార్‌: బుద్ధగయ పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. మహాబోధి అలయంలో పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు…. అప్రమత్తంగా ఉండాలని…

కలెక్టరేట్‌లో కలకలం రేపిన బాంబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో కలెక్టరేట్‌లో బాంబు ఉందంటూ వదంతులు వచ్చాయి. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాంబు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కలెక్టరేట్‌ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాదులో రైల్వే శాఖ సమస్యలను పరిష్కారిస్తామని పలికిన మంత్రి

శంషాబాద్‌, హైదరాబాద్‌: రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌ వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుని ప్రత్యేక రైలులో బీదర్‌కు బయల్దేరారు. ఆయన బీదర్‌లో…

డీసీపీగా బాధ్యతలు చేపట్టిన ఏపీఎస్‌ సత్యనారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీగా ఐపీఎస్‌ అధికారి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి సీఎస్‌వోగా సత్యనారాయణ పనిచేశారు.

నేను సమైక్యవాదినే పలికి మంత్రి శత్రుచర్ల

విజయనగరం: అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తూ మార్గమధ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో అగారు. ఈ సందర్భంగా అయన పూసపాటిరేగలోని కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను సమైక్యవాదినేనని, రాష్ట్రం…

భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

నెల్లూరు (ఫతేఖాన్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ట్రంకురోడ్డు, గాంధీ బొమ్మ, వి. ఆర్‌. జి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.…

సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

తిరుపతి,(జనంసాక్షి): సమైక్యాంధ్రకుకు మద్దతుగా తిరుపతి నగరంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి పట్టణ క్లబ్‌ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దాంతో నగర వీధులల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు…