Wednesday, 25 November 2026

వార్తలు

సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీ: 1984 సిక్కుల వూచకోత కేసులో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.

డిప్యూటీ సీఎం తో ఎన్నారైలు టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశంపై డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహతో అమెరికాలోని తెలంగాణ ప్రాంత ఎన్నారైలు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ అంశంపై గత మూడేళ్లుగా నాన్చుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఎట్టకేలకు ఈ అంశంపై తుది చర్చకు…

వస్తువుల పేరుతో టోకరా

నందిగామ: కృష్ణ జిల్లా నందిగామలో ఆర్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తమిళనాడుకు చెందిన వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. సగం ధర చెల్లిస్తే చాలు వస్తువులు విక్రయిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారు. గడువు ముగిసినా వస్తువులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆర్‌.కె.…

విజయవాడలో కుప్ప కూలిన శిథిల భవనాలు

విజయవాడ : విజయవాడ పాతబస్తీ వించిపేటలోని రాంగోపాల్‌ సత్రం వీధిలో ఉన్న మూడు ఇళ్లు  బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఈ ప్రమాదంలో ఒక ఇంట్లో ఉన్న రాజు అనే రిక్షా కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. దేవాదాయశాఖకు…

రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి…

కాప్రా ప్రాంతంలో 35 పురాతన భవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని కాప్రా మున్సిపల్‌ సర్కిల్‌ ఏరియాలో జీహెచ్‌ఎంసీ అధికారులు 35 పురాతన భవనాలు గుర్తించారు. వారం రోజుల్లో ఈ భవనాలను కూల్చివేస్తామని అధికారలు తెలిపారు.

సర్పంచ్‌ పదవికి వేలం: కేసు నమోదు

వరంగల్‌,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్‌ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న నర్సంపేట సీఐ మధు,…

అమెరికా చేరుకున్న చిదంబరం

వాషింగ్టన్‌,(జనంసాక్షి): భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనిక్కడ పర్యటిస్తారు. ఆరు నెలల్లోపే రెండోసారి ఆయన అమెరికా పర్యటనకు వచ్చాడు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ భారీగా పతనమవుతున్న…

టీమిండియాను చూసి గర్విస్తున్నా: విరాట్‌ కోహ్లి

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌,(జనంసాక్షి): ముక్కోణపు వన్డే టోర్నిలో కీలక సమయంలో విజయం సాధించడం పట్ల టీమిండియా తాత్కాలిక కెప్టెణ్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. యంగ్‌ ఇండియా టీమ్‌ ప్రతిభకు గర్విస్తున్నానని పేర్కొన్నాడు. ట్రైసిరీస్‌ లో భాగంగా మంగళవారం…

బలపడిన రూపాయి

ముంబయి: రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఇవాళ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి రూ. 60.31 పైసలుగా నమోదైంది.