Tuesday, 24 November 2026

వార్తలు

వీఆర్వోలకు క్షమాపణలు చెప్పిన వైరా తహసీల్దార్‌

ఖమ్మం,(జనంసాక్షి): వైరా తహసీల్దార్‌ సలీముద్దీన్‌పై వీఆర్వోలు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమను సలీముద్దీన్‌ తిట్టాడని వారు చెప్పారు. తహసీల్దార్‌ సలీముద్దీన్‌ వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. దాంతో సమస్య సద్దుమణిగింది.

ఉత్తరకాశీలో 9 మంది భావాజీపేట వాసుల గల్లంతు

విజయవాడ (సత్యనారాయణపురం): భావాజిపేట రెండో లైనుకు చందిన 9 మంది యాత్రికులు ఉత్తరకాశీ వరదల్లో గల్లంతయ్యారు. భావాజీపేట నుంచి 15 మంది కాశీయాత్రకు వెళ్లగా వారిలో తొమ్మిది మంది గల్లంతైనట్లు యాత్రకు వెళ్లిన అన్నపూర్ణ అనే మహిళ బంధువులకు…

పెంపుడు కుక్క చనిపోయిందని విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం,(జనంసాక్షి): పెంపుడు కుక్క చనిపోయింని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రొద్దంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంటర్‌ విద్యార్థి సాయికి తమ పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం.అది చనిపోవడంతో తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ఈ నెల 30న నిజాం కళాశాలలో నిర్వహించనున్న బహిరంగసభపై చర్చించినట్లు సమాచారం.

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం 5 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను  www.jee.iitd.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన 8మంది గల్లంతు

కడప: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన తిరుపతి, కడప, జమ్మలమడుగుకు చెందిన 8మంది గల్లంతయ్యారు. ఈనెల 10న తిరుపతి నుంచి ఢిల్లీ మీదుగా కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. ఈనెల 16 నుంచి ఎలాంటి సమాచారం అందలేదని గల్లంతైన వారి కుటుంబసభ్యులు…

థానె ప్రమాదంలో ఏడుగురి మృతి

ముంబయి,(జనంసాక్షి): థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సురక్షితంగా బయటపడిన నల్గొండ జిల్లా వాసులు

నల్గొండ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని నల్గొండ జిల్లాకు పలువురు యాత్రీకులు సురక్షితంగా బయటపడ్డారు. మిర్యాలగూడకు చెందిన ఐదు కుటుంబాల వారు, కోదాడ, హుజూర్‌నగర్‌కు చెందిన 7కుటుంబాల వారు క్షేమంగా ఉన్నట్లు సమాచారమందింది. కొందరు ఏపీ భవన్‌లో ఉండగా,…

జయశంకర్‌ సార్‌ విగ్రహానికి నివాళులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ జాతిపిత దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీఆర్‌ఎస్‌ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేత కె. కేశవరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే…