Tuesday, 24 November 2026

వార్తలు

సురక్షితంగా వస్తున్న ప్రకాశం, కడప జిల్లాల వాసులు

ఢిల్లీ : ప్రకాశం జిల్లాకు చెందిన 81 మంది చార్‌ధామ్‌ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు అక్కడి నుంచి స్వస్థలానికి తిరుగుప్రయాణమయ్యారు. కడప జిల్లాకు చెందిన పదిమందితో పాటు మొత్తం 32 మంది తెలుగువాళ్లు హరిద్వార్‌ నుంచి…

సంక్షేమ భవన్‌ పైకెక్కిన గెస్ట్‌ లెక్చరర్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యలు పరిష్కరించాలంటూ గెస్ట్‌ టీచర్లు, లెక్చరర్లు శుక్రవారం హల్‌చల్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ పైకి ఎక్కిన తమకు సరైన హామీ ఇవ్వకుంటే దూకేస్తామంటూ బెదిరింపులకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌వో

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం వీఆర్వో శ్రీనివాసరావు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

పారిపోయిన సీఎం కిరణ్‌: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శాసనసభలో ప్రజా సమస్యలనై చర్చించకుండా పారిపోయారని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. వాయిదాల పేరిట సభను వాయిదా వేసి తప్పించుకున్నారన్నారు. పనిమాలిన పథకాలు ప్రవేశపెట్టి,వాటి ప్రచారానికే సీఎం పరిమితమయ్యారన్నారు.

యాత్రికులను తరలించేందుకు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

ఢిల్లీ : చార్‌ధామ్‌ యాత్రికులను ఏపీభవన్‌ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు రైల్వే శాఖ అదనపు బోగీలు ఏర్పాటుచేసింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 4 బోగీలు, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు 2 బోగీలు, గోవా ఎక్స్‌ప్రెస్‌, గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లకు చెరో బోగీ ఏర్పాటుచేశారు.…

ఛార్‌థామ్‌లో 190 కి చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): అధికారిక సమాచారం ప్రకారం ఛాఱ్‌థామ్‌ యాత్రలో 190 కి మృతుల సంఖ్య చేరింది. నేడు హరిద్వార్‌ సమీపంలో 40 మృతుదేహాలను భద్రతాసిబ్బంది వెలికితీసింది. 40 హెలికాప్టర్ల సాయంతో తొమ్మిది వేల మందిని భద్రతా సిబ్బంది రక్షించింది. వరద…

500 శవాలను చూశాను కేదార్‌నాథ్‌ అలయ పూజారి

హైదరాబాద్‌ : ‘500 శవాలను నా కళ్లతో చూశా…. దాదాపు నాలుగైదు వేల మంది వరకు చనిపోయి ఉంటారు. నా కుటుంబసభ్యులు ఐదుగురి అచూకీ ఇంకా తెలియ లేదు….’ వరద వచ్చిన రోజు కేదార్‌ నాథ్‌ అలయంలో ఉన్న…

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు రాఘవులు

బాగ్‌లింగంపల్లి,హైదరాబాద్‌ : గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ-2 ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. శుక్రవారం సుందరయ్య కళానిలయంలో గ్రామీణ ఉపాధి మేట్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ…

టీడీపీ ఎమ్మెల్యేల బైఠాయింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబడితే పారిపోతారా అంటూ అధికరాపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శాసనసభ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇవాళ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాని ఓటుతో సభ ఆమోదం తెలిపింది.