Tuesday, 24 November 2026

వార్తలు

తప్పు చేసినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం: కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆంధ్రజ్యోతి పత్రికా, ఛానల్‌ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్దమని, తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రకటించారు. ఆరోపణలు తప్పని తేలితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక…

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కోట్ల

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఉన్న  500మందికి పైగా ఉత్తరాఖండ్‌ వరద బాధితులను కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. యాత్రీకులను రేపు సాయంత్రం లేదా ఎల్లుండి గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కేదార్‌నాథ్‌ సమీపంలో ఐదుగురు కృష్ణా వాసులు మృతి

కృష్ణా: కృష్ణాజిల్లా తోట్ల వల్లూరు మండలం పెనమకూరుకు చెందిన ఐదుగురు యాత్రీకులు కేదార్‌నాథ్‌ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. యాత్రలో పెద్దిదేవి సరోజిని, సూరపునేని సుశీల, నాగలక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, ఆయన తల్లి మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు.

సీమాంధ్ర నేతల సమావేశం రేపు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస ప్రాంగణంలో రేపు సీమాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యాంధ్ర దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చంచనున్నట్లు చెప్పారు.

భాగ్యనగరంలో మహారాష్ట్ర టూరిజం ఆఫీసు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటక ఆఫీసును ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఛగన్‌ భుజబల్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టి వసంత్‌కుమార్‌…

శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను కాగ్‌ని వేదిక వెల్లడించింది. కృష్ణా వరద జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ…

పీఏసీ కొత్త ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీపుల్స్‌ అకౌంట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.

ఐదేళ్ల బాలుడి దారుణ హత్య

ప్రకాశం,(జనంసాక్షి): జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏలూరులో ఐదేళ్ల బాలుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.