ఆయుధాలతో మావోయిస్టు పరారీ
ఖమ్మం : ఇల్లెందు-గుండాల అటవీప్రాంతం నుంచి న్యూడెమోక్రసీ దళసభ్యుడు రఘు ఆయుధాలతో పరారయ్యాడు. ఏకే-47, మరో రెండు ఆయుధాల రఘు వద్ద ఉన్నట్లు సమాచారం
ఖమ్మం : ఇల్లెందు-గుండాల అటవీప్రాంతం నుంచి న్యూడెమోక్రసీ దళసభ్యుడు రఘు ఆయుధాలతో పరారయ్యాడు. ఏకే-47, మరో రెండు ఆయుధాల రఘు వద్ద ఉన్నట్లు సమాచారం
హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కిన్నౌపూర్‌లో కొండ చరియలు విరిగిపడి పది మంది మృతిచెందారు. కిన్నౌపూర్‌లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ, సైన్యం సాయంతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు వెల్లడించారు.
పాట్నా :తాను ఎప్పటికీ లౌకిక వాదినేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అన్నారు. తాను లౌకిక వాదినని మన్మోహస్‌సింగ్ వ్యాఖ్యానించడం సంతోషంగా ఉందని, ఈసందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, దేశ…
ముంబయి : ముంబయిలోని భయాంధర్‌లో భవనం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఢిల్లీ : యమునానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హర్యానాలోని హతినీ కుంద్ నుంచి 4లక్షల క్యూసెక్కుల నీరు యమునానదికి వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ముంబయి : స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం చేగొండపల్లిలో విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మహిళ సజీవదహనమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కాకినాడ : ఏటిమొగలో మూతపడ్డ ఐస్‌ప్లాంట్ నుంచి అమోనియా వాయువు లీకైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
నర్సీపట్నం గ్రామీణం : విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం జోగినాధునిపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సీపట్నం నుంచి కోటవరుట్లకు వెళ్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.…
నెల్లూరు: జమ్ముతావి-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైల్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముతావి ఎస్-3 బోగీలోని మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది సూళ్లూరు పేటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసునమోదు చేశారు.