Saturday, 21 November 2026

వార్తలు

విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ :వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. విద్యుత్‌ సమస్యపై తెదేపా ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో తెదేపా సభ్యలో సభలో సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై మాట్లాడేందుకు ఒక్క…

క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన లక్ష్మణ్‌

గుంటూరు : మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ జోన్‌ బాలుర క్రికెట్‌ అకాడమిని మాజీ క్రికెటర్‌ వి.వి ఎస్‌ లక్ష్మణ్‌ ఈరోజు ఉదయం ప్రారంభించారు.

పెరిగిన గోదావరి ఉద్ధృతి

రాజమండ్రి :ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి ఉద్ధృతి పెరిగింది. బ్యారేజి నుంచి 2,65,000 క్యూసెక్యుల నీటి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

కేబినేట్‌ భేటీకి డుమ్మాకొట్టిన మంత్రులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గసమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎన్‌.రఘువీరారెడ్డి హాజరుకాలేదు. ఈ భేటీలో బంగారు తల్లి పధకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు…

రాష్ట్ర కేబినేట్‌ భేటీ షురూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర కేబినేట్‌ భేటీ ప్రారంభంమైంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశమైంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

వుడా పార్క్‌లో కూలిన భవనం… పది మందికి తీవ్రగాయాలు

విశాఖ: వుడా పార్క్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

టీఆర్‌ఎస్‌లో కేకే కీలక బాధ్యతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతీయ వ్యవహారాల సెంక్రటరీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. రేపు ఆయన తెలంగాణ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోంది మాకెన్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోందని మాజీ కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్‌ అన్నారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. యూపీఏ ముందుకు వెళ్తుంటే… ఎస్‌డీఏ తిరోగమనంలో…

25కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు, హోటళ్లు నేలకొరుగుతున్నాయి. భారీ వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ వరదల దాటికి ఇప్పటి…

తప్పని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశాం: గండ్ర

హైదరాబాద్‌ : తప్పని పరిస్థితుల్లోనే అసెంబ్లీ నుంచి తెరాస, భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి వెల్లడించారు. బీఏసీకి హాజరుకాకుండా సభాపతిపై తెదేపా నేతలు అపనిందలు వేయడం సబబుకాదని ఆయన అన్నారు.