Saturday, 21 November 2026

వార్తలు

పరిష్కారం దిశగా అడుగులు : పొంగులేటి

కేంద్రమంత్రి ఆజాద్‌తో డిఎస్‌ భేటీ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ తెలిపారు. శుక్రవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడారు.…

బస్సు, లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న బంద్‌ సందర్భంగా ఆందోళనకారులు బస్సు, లారీ అద్దాలు పగులగొట్టారు. తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు, రేణికుంటలో బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేశారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

ఖమ్మంలో తెరాస కార్యకర్తలు అరెస్టు

ఖమ్మం: బస్‌డిపో వద్ద పోలీసుల పహరా ఖమ్మం : ఖమ్మంలో బంద్‌ నిర్వహించేందుకు రోడ్లపైకి వచ్చిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో తెరాస ఇచ్చిన బంద్‌ పాక్షికంగా జరుగుతోంది. బంద్‌ నిర్వహించేందుకు మయూరి సెంటర్‌కు…

ఇవాళ విద్యుత్‌ సౌధా వద్ద మహాధర్నా

హైదరాబాద్‌, (జనంసాక్షి): నిన్నటి ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణనేతలను, తెలంగాణవాదులను ప్రభుత్వం అరెస్టు చేయడంపై తెలంగాణనేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యుత్‌సౌధా వద్ద మహాధర్నా నిర్వహించాలని తెలంగాణ…

ఫిషరీన్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన సీఎం

కృష్ణా: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భవనాలను, కళాశాల వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం టీ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ జేఏసీ భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు.

డీఈఓను నిర్భంధించిన ఎమ్మల్యే సోదరుడు

అనంతపురం: పట్టణంలోని వివాదాస్పద మిస్సమ్మ స్థలంలో అనుమతి లేని పాఠశాలను మూసివేసేందుకు డీఈఓ యత్నించారు. దీంతో డీఈఓను స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అడ్డుకున్నారు. తాను చెప్పినట్లు నివేదిక రాయలని డీఈఓను నిర్బంధించారు. ఎర్రిస్వామిరెడ్డి అనుచరులు డీఈఓ రాసిన…

శాసన మండలి వ్యవహారాల సలహాసంఘం భేటీ

హైదరాబాద్‌ : శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రాంభమైంది. బడ్జెట్‌ రెండో దఫా సమావేశాల అజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

గోదావరిలో జాలర్లు గల్లంతు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం పెరగింది. వాజేడు మండలం ఏజర్లపల్లికి చెందిన 30 మంది మత్స్యకారులు నిన్న చేపల వేటకు వెళ్లి గోదావరిలో చిక్కుకున్నారు. వీరిలో పదిహేను మందిని పోలీసులు…