Saturday, 21 November 2026

వార్తలు

12 ఇసుక ట్రాక్టర్ల పట్టుకున్న సీఐ

చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను వైరా సీఐ మోహన్‌రాజా పట్టుకున్నారు. మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక…

భద్రాచలం క్షేత్రానికి పోటెత్తిన హనుమాన్‌ భక్తులు

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. రేపు హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ…

21 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

నెల్లూరు  జిల్లా : ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్‌ దుకాణం నుంచి బియ్యాన్ని తరలిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ

హైదరాబాద్‌(జనంసాక్షి:)  సీమాంధ్ర దురహంకారంతో ప్రవర్తిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీనగర్‌లో కృష్ణ జలాల ఫేజ్‌`3 పనుల శంకుస్థాపన సభలో సీఎం ప్రసంగాన్ని తెలంగాణ వాటర్‌ వర్క్స్‌ కార్మికులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావును పిలవకపోవడంపై ఆందోళన…

ఐకేపీ సిబ్బంది దీక్షలు ప్రారంభం

ఖమ్మం సంక్షేమం : జిల్లా ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద దీక్షలను ప్రారంభించారు. 12వ రోజు దీక్షలను జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను…

కుటుంబాన్ని వెలివేయడంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

కరీంనగర్‌ : జిల్లాలోని బండలింగంపల్లిలో కుటుంబాన్ని వెలివేసిన ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. కుటుంబాన్ని వెలివేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మానవ హక్కుల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది.

ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై మరోదఫా విచారణ

హైదరాబాద్‌ : ధిక్కార శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై సభాపతి నాందెడ్ల మనోహర్‌ దఫా విచారణ చేపట్టారు. ఈ విచారణకు టీడీఎల్పీ వివ్‌ నరేంద్రం, తెదేపా ధిక్కార ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు.

తుంగభద్ర డ్రైనులో ముగ్గురు యువకుల గల్లంతు

గుంటూరు : కర్లపాలెం మండలం ఎం. వి. రాజుపాలెంలో బుద్ధాం తుంగభద్ర డ్రైనులో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్యాకేజీల కోసమే తెరాసలో చేరుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్‌: వ్యక్తిగత అజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ అరోపించారు. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు పెట్టి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ…

మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారిని నిర్భంధం

గుంటూరు : జిల్లాలోని దుగ్గిరాల మండలం పెదకొండూరులో రైతులను మోసగించిన మొక్కజొన్న వ్యాపారిని గ్రామస్థులు నిర్బంధించారు. కొద్ది రోజుల కిందట రూ. 40 లక్షలు విలువైన మొక్కజొన్నలతో వ్యాపారి పరారయ్యాడు. మోసం చేసిన వ్యాపారి శనివారం గ్రామంలోకి రావడంతో…