Thursday, 19 November 2026

వార్తలు

ఇన్ఫోసిస్‌పై తాజాగా మరో 582 కోట్ల పన్ను భారం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆదాయపనున్న శాఖ ఇన్ఫోసిన్‌పై తాజాగా 2009 సంవత్సరానికి గాను రూ. 582 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీస్‌ పంపించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిన్‌ 2005 నుంచి నాలుగు సంవత్సరాలకు సంబంధించి 1,175 కోట్ల…

రాష్ట్రంలో అక్కడక్కడా వానాలు కురిసే అవకాశం

విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా అల్పపీడన…

సంజీవరెడ్డి జీవితం అందరికి మార్గదర్శకం: గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి సాధించిన రైతు బిడ్డ  నీలం సంజీవరెడ్డి అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్దాంతాలకు,…

ఐపీఎల్‌లో నేడు

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు పుణె, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. హైదరాబాద్‌ వేదికగా రాత్రి 8 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌ హైదరాబాద్‌,…

చైన్నెలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

చైన్నె , జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ పై చర్చించేందుకు బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ చైన్నెలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో బీసీసీఐ  కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఫిక్సింగ్‌ ఆరోపణులతో అరెస్టయిన క్రీడాకారులపై  జీవితకాల నిషేధం…

40 తులాల బంగారం, కిలో వెండి చోరీ

హైదరాబాద్‌, జనంసాక్షి: సరూర్‌నగర్‌ మండలం అల్మాన్‌గూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎర్ర చందనం పట్టివేత

చేజర్ల, జనంసాక్షి: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పాత పాడు వద్ద ఈ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలకోన అటవీ ప్రాంతం…

శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి

తిరుమల, జనంసాక్షి: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే సమస్యే లేదని సమైక్యంగానే ఉంటుందని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదులే గెలుస్తారన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌…

రాజీనామా వూహాగానాలపై ధర్మాన స్పందన

శ్రీకాకుళంజిల్లా, జనంసాక్షి: రాజీనామా వూహాగానాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. తనపై వస్తున్న వూహాగానాలపై మీడియా నచ్చినట్లు విశ్లేషించుకోవచ్చుని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై హైదరాబాదులోనే మాట్లాడతానని మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌, బయలుదేరనున్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జనంసాక్షి: మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ మధాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు వచ్చి తనకు కలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో జిల్లాలో రేపటి  కార్యక్రమాలను ధర్మాన రద్దు చేసుకున్నారు.