సచివాలయ ముట్టడికి టీఎస్‌ఎస్‌ఎఫ్ యత్నం
హైదరాబాద్: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్ తరలించారు.
హైదరాబాద్: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్ తరలించారు.
ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే…
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఈనెల 9న జరిగిన వెంకటేష్ అనే వ్యక్తి హత్యకేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 3 వేటకొడవళ్లు, 3పిడిబాకులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: దాల్మియా ఛార్జిషీటులో నిందితుల సమన్లను సీబీఐ న్యాయస్థానం సీబీఐకి ఈరోజు అందజేసింది. ఈ కేసులో నిందితుడైన వైఎస్ జగన్‌ను వచ్చేనెల 7న కోర్టులో హాజరుపరచాలని సీబీఐకి పీటీ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా…
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విజయవాడ : కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని…
వినుకొండ: దారి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ : కేంద్రం మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి: నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌సీ సెన్సెక్స్ 51 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయాయి.
హైదరాబాద్: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండల పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 కిలోల వెండి, రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.