Thursday, 19 November 2026

వార్తలు

చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి

పార్వతీపురం : చెల్లెలి పెళ్లి రోజే అన్న గుండె పోటుతో మృతి చెందిన విషాద సంఘలన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకొంది. వివేకానందనగర్‌ కాలనీలో చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి చెందాడు. గోపాలశెట్టి…

కొత్తదంపతులతో కళకళలాడుతున్న తిరుమల

ఉదయం 500 పెళ్లిళ్లు గదులు దొరక్క సామాన్యుల ఇబ్బందులు తిరుమల : నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావడానికి నూతన జంటలు పోటీపడ్డాయి. భక్తకోటితో కిటకిటలాడే దివ్యక్షేత్రం నేడు నూతన వధూవరులతో నిండిపోయింది.…

సాయంత్రం హస్తిన వెళ్లనున్న రఘువీరా

హైదారాబాద్‌ : మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 13 ఢిల్లీలో జరిగే జాతీయ విపత్తు నిర్వహణ సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షుతన ఈ సదస్సు జరగనుంది.

‘ఎంసెట్‌’ ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్‌ : ఎంసెట్‌-2013 ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు ఇవాళ విడుదల చేశారు. ఎంసెట్‌ వెబ్‌సైట్‌లోనే కీని…

మంత్రి సభను అడ్డుకున్న రైతు సంఘాల నాయకులు

రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రైతు సంఘాల నాయకులు రైతు సదస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. విద్యుత్తు, రైతు సమస్యలు పరిష్కరించాలని మంత్రి తోట నర్సింహంను అడ్డుకున్నారు.

భారీగా విదేశీ సిగరేట్ల స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 60 కార్టన్ల విదేశీ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు.

మానవహక్కుల నేత జయ వింధ్యాల అరెస్ట్‌

సికింద్రాబాద్‌ : మానవహక్కుల నేత జయ విధ్యాలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఫిర్యాదు మేరకు పద్మారావు నగర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

రూ. కోటి విలువైన హెరాయిన్‌ స్వాధీనం

అసోం : సిల్‌చార్‌లోని హోటల్‌లో రూ. కోటి విలువైన 550 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు.

విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్‌ల ధరపెంపు

హైదరాబాద్‌ : విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ల ధరలు పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో విద్యార్థులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం కోత విధించింది. ప్రభుత్వం ఇప్పటి దాకా ఇస్తున్న 90 శాతం రాయితీని 66.7 శాతానికి…

నిరుపేద జంటలకు వివాహాలు

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. శిల్పాసేవా సమితి చేపట్టిన పెళ్లిసంబరాలు కార్యక్రమంలో భాగంగా 20 మంది వధువరులకు పెళ్లి వస్త్రాలు, సామగ్రిని, విందుభోజనాలను…