Wednesday, 4 November 2026

చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి

పార్వతీపురం : చెల్లెలి పెళ్లి రోజే అన్న గుండె పోటుతో మృతి చెందిన విషాద సంఘలన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకొంది. వివేకానందనగర్‌ కాలనీలో చెల్లి పెళ్లి రోజే అన్న గుండెపోటుతో మృతి చెందాడు. గోపాలశెట్టి వరలక్ష్మికి ఆదివారం తెల్లవారుజామున వివాహం జరిగింది. శనివారం మధ్యాహ్నం వరకూ పెళ్లిపనులతో హడావుడిగా ఉన్న అన్న గుండెలో నోప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, ఆదివారం ఉదయం పెళ్లి జరిగాక, దహన సంస్కారాల సమయంలో పెళ్లికూతురికి ఈ విషయం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *