Tuesday, 17 November 2026

వార్తలు

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్‌ నిమ్స్‌ ఆస్పత్రే అని ఆయన…

లొంగిపోయెందుకు మరింత గడువివ్వండి

సుప్రీంలో సంజయ్‌దత్‌ పిటిషన్‌ న్యూఢీల్లీ , ముంబై: లొంగిపోయేందుకు మరింత సమయమివ్వాలని కోరుతూ నటుడు సంజయ్‌దత్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు ఈ వారంతో ముగియనుండటంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 1993…

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న బస్సు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సింగరేణిలో కార్మికసంఘాల ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: సింగరేణి ఎంట్రీ గనిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) మృతికి నస్టనరిహారం చెల్లించాలని గోదావరిఖని సింగరేణిలో కార్మికసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాత్రి ఎండీ గాలిబ్‌ గనిలోని 75 లెవల్‌ వద్ద…

పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు పోలీస్‌ పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. డ్యూటీ మీట్‌ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం ఉదయం జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. విషయాన్ని ఆలస్యంగా గమనించి అధికారులు అనంతరం…

29 నుంచి తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు

నస్పూర్‌కాలనీ(ఏసీసీ),జనంసాక్షి : ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అశోక్‌రావు పేర్కొన్నారు. సోమవారం…

కాంగ్రెస్‌పై నమ్మకం ఉందన్న మంత్రి శ్రీధర్‌

విశాఖ,జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై పూర్తి స్థాయి నమ్మకం ఉందని పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయిల్‌ ట్యాంకర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

ఆకతాయిల చేతిలో దహనమైన 14 బైకులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కేకే రెసిడెన్సీ సెల్లార్‌లో ఈ తెల్లవారు జామున ఆకతాయిలు 14 ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. దీంతో మెదటి అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని…

మధ్యాహ్నం నుంచి అన్నదానం యథావిధి

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం అన్న ప్రసాదాలు తయారు చేసే క్యాంటీన్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.…

తిరుమల వసతి సముదాయాల్లో చోరీ

తిరుమల, జనంసాక్షి : తిరుమలలోని మూడు జీఎన్‌సీ వసతి సముదాయాల్లో చోరీ జరిగింది. భక్తులకు చెందిన దుస్తులు, సెల్‌ఫోన్లు , నగదును దొంగలు అపహరించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.