Tuesday, 17 November 2026

వార్తలు

గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకల పునర్ధురణ

కర్నూలు, జనంసాక్షి : బేతంచర్లలోని సిమెంట్‌నగర్‌ వద్ద గెంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న గూడ్స్‌ రైల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు.

గూడ్స్‌ రైల్‌ ఇంజిన్‌లో మంటలు

కర్నూలు , జనంసాక్షి: బేతంచర్ల సిమెంట్‌నగర్‌ వద్ద గూడ్స్‌ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిక అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ గూడ్స్‌ రైలు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ ఘటన కారణంగా బుగానిపల్లి…

జగన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢీల్లీ , జనంసాక్షి: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌ గూడ జైల్లో ఉన్న వైకాపా అధినేత జగన్‌ మరోసారి సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పబ్బులపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి : నగరంలో పబ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 17లోగా పబ్‌ లపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరను ఆదేశించింది.

హైదరాబాద్‌ : బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ , జనంసాక్షి: నగరంలో బులియన్‌ ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ. 29,460, 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 260గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…

శిక్ష అమలులో జాప్యం కారణంగా

మరణశిక్షన మార్చలేం :సుప్రీం కోర్టు న్యూఢీల్లీ , జనంసాక్షి: దేవేందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 1993లో యువజన కాగ్రెస్‌ అధ్యక్షుడు బిట్టాపై బాంబు దాడి  కేసులో భుల్లార్‌ మరణ శిక్ష ఎదుర్కొంటున్నాడు.…

భార్య గొంతుకోసిన భర్త

అనంతపురం , జనంసాక్షి: కుటుంబ కలహాలతో ఓ భర్త .. భార్య గొంతుకోసిన ఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం పెనకొండవారిపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలిని స్థానికులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త సుబ్బిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిల్లులో అగ్ని ప్రమాదం

హుజూరాబాద్‌ గ్రామీణం (కరీంనగర్‌) , జనంసాక్షి: పట్టంలోని నవజీవన్‌ కర్ర మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రామాదంలో మిల్లులో ఉన్న యంత్రా లతో పాటు కర్రలు దగ్ధమయ్యాయి. విద్యుత్తు షార్ట్‌సర్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు యజమాని…

లారీ ఢీకొని ఐదుగురి మృతి

తిరుమలాయపాలెం , జనంసాక్షి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం వద్ద శుక్రవారం  జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతో ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాలిలా ఉన్నాయి.…

వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు

చిత్తూరు , జనంసాక్షి: యేర్పేడు మండలం సదాశివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించాడు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను తిరుపతి రుయా  ఆసుపత్రికి తరలించారు. దాడికి దిగిన యువకుడికి స్థానికులు…