Tuesday, 17 November 2026

వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీయూలో ఉన్నాయి : సురవరం

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి ఐసీయూలో ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ ఉద్యమంతో కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాయేతర…

ఎర్రచందనం పట్టివేత

ఆళ్లగడ్ద : కర్నూలు జిల్లా అళ్గగడ్డలో రూ. 5లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరికాయల లోడు లారీలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఎర్రచందనంతో సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.

పేదరికంతో కొడుకును కడతేర్చిన తండ్రి

కడప : కడప పట్టణంలోని యానాది కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మానిసిన వికలాంగుడైన కొడుకును తండ్రి గొంతు నులిచి చంపేశాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పేదరికంతో వైద్యం చేయించేకే కొడుకుని చంపినట్లు నిందితుడు…

అక్రమ నివాసాల తొలగింపు

తండమేరు : అనంతపురం జిల్లా తండమేరులో అక్రమంగా వేసిన గుడిసెలను పురపాలక అధికారులు తొలగిస్తున్నారు. తమ నివాసాలను తొలగించవద్దంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అప్పాలో ఎస్‌ఐల సాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీలో 2012 బ్యాచ్‌ ఎస్‌ఐల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్ది, డీజీపీ దినేష్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. 1,256 మంది…

మూడోరోజు ఎమ్మెల్యేల నిరాహారదీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యపై ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడోరోజుకు చేరుకుంది. విద్యుత్‌ సమస్యపై ప్రభుత్వం పోరాడేందుకు వైకాసా మినహా అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం.

పాక్‌లో భారత ఖైదీపై కిరాతకం

న్యూఢిలీ/ జమ్మూ : చామల్‌ సింగ్‌ అనే భారత ఖైదీని పాకిస్థాన్‌లో రెండు నెలల క్రితం అమానుషంగా హింసించి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ జిల్లాకు చెందిన ఆయన గూఢచర్యం ఆరోపణలపై లాహోర్‌లోని కోట్‌ లక్‌పత్‌…

బెర్లిన్‌ గోడలో మరికొంత భాగం కూల్చివేత

బెర్లిన్‌ : చారిత్రక బెర్లిన్‌ గోడలో మరికొంత భాగాన్ని కూల్చేశారు. ఓ లగ్జరీ అపార్టు మెంటు నిర్మాణం కోసం గోడలో సుమారు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా గోడను తొలగించారు. అర్థరాత్రి సమయంలో కూల్చివేత కార్యక్రమం మొదలుపోట్టి తెల్లవారేసరికి పూర్తిచేశారు.…

ఆగని అత్యాచారాలు

సింగరాయకొండ : ప్రకాశం జిల్లా అద్దంకిలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. సింగరాయకొండ తిరనాళ్లలో ఓ…

మెదక్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని నందిగామకు రానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు కోసం 70 ఎకరాల విస్తీర్ణంలో అసోసియోషన్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌(ఎలీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు…