Tuesday, 17 November 2026

వార్తలు

నగరంలో హోలీ వేడుకలు

హైదరాబాద్‌ : నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. సభ్యులు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. బేగంబజార్‌లో హోలీ ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. యువతీయువకులు రంగులు చల్లుకుంటూ…

గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న దీక్షలు

హైదరాబాద్‌ : ఇందిరాపార్కు వద్ద దీక్ష భగ్నం అనంతరం వామపక్ష పార్టీల నేతలు గాంధీ ఆసుపత్రిలో నిరసన కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులుగా నిరవధికి నిరాహార దీక్ష చేస్తుండటంతో నిరాయణ, రాఘవులతోపాటు పలువురి నేతల ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు కూలీల మృతి

నెల్లూరు : దొరవారిసత్రం మండలం పాలెంపాడు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రాజ్‌భవన్‌లో ఘనంగా హోలి వేడుకలు

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, పాఠశాలల విద్యార్థులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గోన్నారు. గవర్నర్‌కు పలువురు చిన్నారులు అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ కూడా కుటుంబసభ్యులతోపాటు పలువురు అధికారులకు,…

మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌

కాబూబ్‌ : ఆప్ఘనిస్థాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. జలాలాబాద్‌లోని పోలీస్‌ స్థావరంపై ఏడుగురు ఆత్మాహుతిదళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ముందుగా గేటు వద్ద కారు బాంబు పేల్చి తీవ్రవాదులు, ఆ వెనువెంటనే మరో రెండు మానవ బాంబులను…

8కి చేరిన పేలుడు మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : వికారాబాద్‌ సిలిండర్‌ పేలుడు ఘటనలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ అనే మహిళ మంగళవారం ఉదయం మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. గత శుక్రవారం వికారాబాద్‌లోని…

పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం

వైఎస్‌ఆర్‌ జిల్లా : ఓబులవారిపల్లె శివారులోని పొలాల్లో గుర్తు తెలియని మృతిదేహన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…

లారీ – కారు ఢీ, స్మగ్లర్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెను8మలూరు క్రాస్‌ రోడ్డు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి స్మగ్లర్‌ ప్రయాణిస్తున్న కారు.. ఓ లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం…

సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ విపక్షాల ఆందోళనలతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి సిద్దమైంది. ఈ సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల నేతలతో బాబ్లీ ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రభుత్వం…

15.358 రెవెన్యూ సదస్సులు నిర్వహించాం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులపై మంత్రి రఘువీరారెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ 15,358 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు.