Tuesday, 17 November 2026

వార్తలు

ధర్నా చేపట్టిన నిజాం కళాశాల వసతిగృహ విద్యార్థులు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్‌బాగ్‌లోని వసతిగృహం ముందు అన్నం గిన్నెలతో ధర్నా చేపట్టారు. అన్నంలో వంట సోడా కలుపుతుండటంతో తాము అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20…

లుంబినీ పార్కులో భద్రత ఏర్పట్ల పరిశీలన

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటన నేలథ్యంలో పోలీసులు నగరంలో వివిధ పార్కుల వద్ద భద్రతా చర్యలను సమీక్షించారు. లుంబినీ పార్కులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సరిగా లేదని పార్కు నిర్వాహకులకు సైఫాబాద్‌ పోలీసులు నోటీసులు…

కింగ్‌కోఠిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : కింగ్‌కోఠి ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ గోదాములో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా గోదాములో ఉన్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

అనంతపురం : సింగనమల మండలం పెరవలి సమీపంలో ఆర్టీసీ బస్సు సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా… 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

బడ్జెట్‌ రూపకల్పనలో లోపాలు ఉన్నాయి : కాగ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర పరిస్థితులపై శాసనసభకు కాగ్‌ నివేదిక సమర్పించింది. బడ్జెట్‌ రూపకల్పనలో లోపాలు ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చుల మధ్య పొంతన లేదని తెలిపింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల…

యూపీఏకు మద్దతు ఇవ్వబోం

డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై, మార్చి 25 (జనంసాక్షి) : శ్రీలంక తమిళుల విషయంలో ద్రోహం తలపెట్టిన యూపీఏకు మద్దతివ్వబోమని డీఎంకే చీఫ్‌ కరుణానిధి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రతికా ప్రకటన విడుదల…

ఎఫ్‌ఎం రేడియో శంకుస్థాపనలో తాపీపట్టిన సోనియా

రాయ్‌బరేలి, మార్చి 25 (జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సోమ వారం తాపీ మేస్త్రీ అవతారం ఎత్తారు. స్థానికంగా ఏర్పాటు చేయనున్న ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ…

బిక్స్‌ కూటమి కొత్త బ్యాంక్‌

రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం డర్బన్‌, (జనంసాక్షి) : వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ప్రపంచ అభివృద్ధి కోసం కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిక్స్‌ కూటమి ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి…

విద్యుత్‌ సమస్యలపై చర్చకు విపక్షాల పట్టు

హైదరాబాద్‌: వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు శాసన సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై తక్షణపై చర్చ చేపట్టాలని తెదెపా, వామపక్షాల సభ్యులు డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ స్టేడియం చుట్టుముట్టారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు సిద్ధంగా…

వాయిదా తీర్మానాల తిరస్కరణ

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. వివిథ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.