Monday, 16 November 2026

వార్తలు

దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్‌ హెచ్చరించారు. సంఘటనా స్థలాలను పరిశీలించిన…

పేలుళ్ల ఘటనాస్థలిని పరిశీలించిన వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు ఈ ఉదయం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేర్‌, కోమల, యశోద ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…

నదిలోకి దూసుకెళ్లిన బస్సు…19 మంది మృతి

ఇస్లామాబాద్‌: పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు పాకిస్థాన్‌ పెషావర్‌ సమీపంలోని నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చర్సద్ద రహదారిలో 45 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే…

రూ. 15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: మానూరు మండలం ఎంకపల్లి శివారులో గంజాయి తోటలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 15 కోట్ల విలువైన గంజాయిని గుర్తించారు. తోటలను ట్రాక్టర్లతోదున్నించి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పేలుళ్ల ఘటనతో ప్రభుత్వానికి చెడ్డపేడు : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. బాంబు దాడులపై కేంద్రం ముందే హెచ్చరించినా…ఇక్కడి పోలీసులు తేలికగా తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సొంత మంత్రులు,…

పాతకక్షలతో ఇద్దరి హత్య

మహబూబ్‌నగర్‌ : ధరూర్‌ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు  హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతులను జీరబండ గ్రామానికి చెందిన నర్సింహులు (60), చింతరేవుల గ్రామానికి…

నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ సందర్భంగా రెండు రాష్ట్రాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60…

ఛార్జీల పెంపుపై నేడు వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ

వరంగల్‌: విద్యుత్‌ ఛార్జిల పెంపు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు తదితర అంశాలపై ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ వరంగల్‌ జిల్లాలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.  ఎంపీడీసీఎల్‌ పరిధిలో వరంగల్‌లోని జడ్పీ కార్యాలయంలో కమిషన్‌ బహిరంగం విచారణ జరపనుంది.…

నెల్లూరు కలెక్టర్‌, ఎస్పీలకు లోకాయుక్త నోటీసులు

నెల్లూరు : గూడూరు సబ్‌కలెక్టర్‌కు ఇచ్చిన వారెంట్లను అమలు చేయకపోవడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ…

ఆజాద్‌ను కలిసిన నేతలు

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ను లేక్‌వ్యూ అతిధిగృహంలో తెలంగాణ ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై నేతలు ఆజాద్‌తో చర్చించినట్లు సమాచారం తెలిసింది.