Monday, 16 November 2026

వార్తలు

మక్బూల్‌ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలోని తీహార్‌ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది మక్బూల్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లపై అతన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ అధికారులు కూడా అతన్ని ప్రశ్నించే అవకాశముంది.

ఉద్యోగసంఘాలతో ఉప సంఘం భేటీ

హైదరాబాద్‌: ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో… తదితర ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలియవచ్చింది.

ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: బీఈడీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌ నోటీఫికేష్‌ను  ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. జూన్‌ 3న ఎడ్‌సెట్‌ పరీక్ష వుంటుందని జూన్‌ 21న ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశరావు తెలిపారు. ఈ…

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

మలక్‌పేట : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లఘటనలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్‌, పాండురంగారెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కోసం కౌన్సిల్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ప్రభుత్వం ఒక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు.

వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

వరంగల్‌: ఛార్జీల పెంపుపై విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. ఐదు జిల్లాల  ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసుల నిర్బంధం మధ్య విచారణ చేపట్టడంపై చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విచారణ రెండు సార్లు…

పేలుళ్ల ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి :దేవేందర్‌ గౌడ్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి , మంత్రులు రాజీనామా చేయాలని తెదేపా సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలిని దేవేందర్‌గౌడ్‌ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫ్యలంతోనే ఈ ఘటన…

విద్యుదాఘాతంతో తల్లీకొడుకుల మృతి

చల్లపల్లి : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఒక్కలగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో తల్లీ కుమారుడు మృతి చెందాడు. కోళ్లఫారంలో పని చేస్తున్న డేగుల రమణ (45) పొరపాటున అక్కడ ఉన్న విద్యుత్తు తీగాలను తాకి విద్యుదాఘాతానికి గురయింది. ఆమె…

కేర్‌లో ముగ్గురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం వైద్యులు తాజా బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం 22 మందికి చికిత్స అందిస్తున్నట్లు… వీరిలో…

క్షతగాత్రులను పరామర్శించిన సభాపతి

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సభాపతి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో బాధితులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంధువులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం…