Monday, 16 November 2026

వార్తలు

పొన్నాల కేసు విచారణ 27కి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణను హైకోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది. పొన్నాల ఎన్నికల చెల్లదంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఇప్పటికే మంత్రి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కిరణ్‌కుమార్‌రెడ్డితో జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

ఆస్తుల అటాచ్‌మెంట్‌పై విచారణ మార్చి 18న

ఢిల్లీ : రాంకీ, జగతి పబ్లికేషన్‌స కేసులో ఈడీ నోటీసుపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరపనుంది. రాంకీ, జగతి కేసులో రూ. 143.7 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ చేస్తూ జనవరి 7న ఈడీ నోటీసు జారీ…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,450.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,160. కిలో వెండి…

ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ ప్లూ మరణాలు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి  స్వైన్‌ప్లూ పరీక్షలు పాజిటివ్‌ వచ్చాయి. పుణెలో రెండు సీరియన్‌ కేసులు, ఒక మరణం…

రెండోరోజుకు చేరిన సార్వత్రిక సమ్మె : ఏటీఎంలలో డబ్బుల్లేవ్‌!

ఢిల్లీ : సార్వత్రిక సమ్మె రెండో రోజుకు చేరడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలోనూ బ్యాంకులు పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఏటీఎంలలో చాలా చోట్ల డబ్బులు లేక ప్రజలు…

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హైదరాబాద్‌: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి శివశంకర్‌ తెలుగులోనే మాట్లాడుతామని, తెలుగులోనే రాస్తామని, మాతృభాషకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఆసియన్‌ అధ్లెటిక్‌ పోటీలు తమిళనాడులో జరగవు

చెన్నై: జూలైలో జరగాల్సిన ఆసియన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు తమిళనాడులో నిర్వహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  ప్రకటించారు. శ్రీలంకని ఇందులో పాల్గొనవద్దని కేంద్రం చెప్పనందునే అమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియన్‌ అథ్లెటిక్స్‌లో శ్రీలంక పాల్గొనడం వల్ల తమిళుల…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాల విడుదల

డిసెంబరులో విడుదల చేసిన ప్రకటనల గడువు పెంపు హైదరాబాద్‌: గ్రూప్‌ -4 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలు ఇవాళ, రేపట్లో జిల్లాలకు చేరుకోనున్నాయి. మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా జిల్లాల్లోని పోస్టులను కలెక్టర్ల నేతృత్వంలో భర్తీ…

ఆర్థికవృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది: రాష్ట్రపతి

హైదరాబాద్‌ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు న్యూఢిల్లీ : ప్రపంచంలో నెలకోన్న ఆర్ధిక మాంధ్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన…