Monday, 16 November 2026

వార్తలు

సత్యం కేసు నిందితుల అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ అప్పీలు చేశారు.

సత్యం కేసు నిందితుల అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ అప్పీలు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు

ఢిల్లీ:  ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ స్వాగత కార్యక్రమం అనంతరం కొలువుదీరిన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే  విపక్షాల నిరసనలు మొదలయ్యాయి. నిరసనల మధ్య రాష్ట్రపతి ప్రసంగం…

పార్లమెంటుకు బయల్దేరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంట్‌ భవనానికి తీసుకునివస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

పార్లమెంట్‌ ఎదుట టీఎంపీల ధర్న

ఢిల్లీ : పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. మొదటి గేటు ముందు బైఠాయించిన  ఎంపీలు జై తెలంగాణ, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని నినాదాలు…

ఈ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నా : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లి: నేటినుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మరోపక్క సమావేశాలు ఇంకా ప్రారంభమన్నా కాలేదు, పార్లమెంటు ముఖద్వారం వద్ద బైఠాయించి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని నలుగురి మృతి

నార్సింగి : రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవుల వద్ద ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఢికొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

ఎమ్మెల్సీ అభ్యర్థికి గుండెపోటు

కరీంనగర్‌ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లి రాజమౌళికి గురువారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనను…

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి.