Monday, 16 November 2026

వార్తలు

నేడు రాష్ట్ర బంద్‌కు భాజపా, వీహెచ్‌పీ పిలుపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనను నిరసిస్తూ భాజపా వీహెచ్‌పీ నేడు రాష్ట్రబంద్‌ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న మెతకవైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని భాజపా నేతలు విమర్శించారు.

పార్లమెంట్‌లో టీ కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తొలి రోజే తెలంగాణ సెగ తగిలింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర…

అడ్డంకులు, అవాంతరాలు మనకు కొత్తకాదు

ఏకీరాస్తా సడక్‌బంద్‌ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కల్పించినా ‘సడక్‌బంద్‌’ కార్యక్రమం నిర్వహించి తీరతామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్పష్టం చేసింది. సడక్‌ బంద్‌ను దిగ్విజయవంతం చేసి తెలంగాణ ఆకాంక్ష…

సభసాగేందుకు సహకరించండి

నిర్మాణాత్మక సూచనల్విండి : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్ర విజ్ఞప్తి చేశారు. సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.…

పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం

పేదల కోసమే నగదు బదిలీ మహిళా భద్రతకు రాజీలేదు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): అన్ని సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. నగదు బదిలీతో…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

తమిళనాడు : తిరువళ్లూరు జిల్లా పుదురువేడులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, వ్యాను ఢీ కొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం తెలిసింది.

గుజరాత్‌లో ఐపీఎన్‌ అధికారి అరెస్టు

అహ్మదాబాద్‌: ఇష్రత్‌ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ అధికారులు గుజరాత్‌కు చెందిన ఐపీఎన్‌ అధికారి జీఎల్‌ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 2004 జూన్‌లో ఇష్రత్‌ జహాన్‌ అనే యువతితో పాటు మరో ముగ్గురు యువకులు అహ్మదాబాద్‌ శివారులో…

ఒత్తిళ్లు ఉన్నా పోరాటం కొనసాగిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : తమ పై ఒత్తిళ్లు ఉన్నా తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేశామన్నారు. గుర్ఖాల్యాండ్‌తో తెలంగాణకు పొంతనలేదని వారు పేర్కొన్నారు.

ప్రయాణాలు వాయిదా వేసుకుని సడక్‌బంద్‌కు సహకరించండి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనందునే సడక్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. రేపు కొత్తూరు నుంచి అలంపూర్‌ వరకు భాజపా సడక్‌బంద్‌ ప్రచార యాత్ర ఉంటుందని అందరూ ప్రయాణాలే వాయిదా…

నోయిడా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 65 మంది అరెస్టు

న్యూఢిల్లీ : ట్రేడ్‌ యూనియన్ల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మొదటిరోజు నొయిడాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల మీద రాళ్లు రువ్వడం, 25 వాహనాలను తగలబెట్టడం తదితర ఘటనలకు వీరు…