Monday, 16 November 2026

వార్తలు

అక్బరుద్దీన్‌కు రిమాండ్‌ పొడిగింపు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్‌ కోర్టు విధించిన రిమాండ్‌ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్‌ పొడిగించింది. 12న తిరిగి ఆయనను కోర్టులో…

నడిరోడ్డుపై వ్యక్తి హత్య

హైదరాబాద్‌: నగరంలోని మొజాంజాహి మార్కెట్‌ సమీపంలోని దారుస్సలాం రోడ్డులో ఒక వ్యకి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి చంపినట్లు సమాచారం తెలిసింది.

పొన్నాల వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: హైకోర్టులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య వాంగ్మూలం నమోదుచేశారు. మంత్రి పొన్నాల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కొమ్మూరి ప్రతాపరెడ్డి దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం పొన్నాల వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

ఓయూ స్నాతకోత్సవంలో జై తెలంగాణ

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. కాన్వోకేషన్‌ పత్రాలు తీసుకుంటూ విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.

తమిళనాడుకు నీరు విడుదల చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : తమిళనాడుకు 2.44 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు మరోసారి సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.

స్వల్పంగా పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఈరోజు నమోదైన బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,870.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700.…

దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిపై సదస్సు

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిపై శాసనసభ ఆవరణలోని జూబిలీహాలులో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీరథ్‌, రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

శంకర్‌రావుకు జానా పరామర్శ

హైదరాబాద: కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును మంత్రి జానారెడ్డి, ఎంపీ వివేక్‌ ఈరోజు ఉదయం పరామర్శించారు. నేరేడ్‌మెట్‌ పోలీసులు విచారణ నిమిత్తం శంకర్‌రావును తీసుకెళ్లగా ఆయన అస్వస్థులై ఆస్పత్రిలో చేరారు.

హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు హైకోర్టుకు హజరయ్యారు. జనగామ శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ట రీకౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన న్యాయస్థానానకి వచ్చారు. పొన్నాల ఎంపిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009…