Sunday, 15 November 2026

వార్తలు

కుటుంబకలహాలతో అన్న, తమ్ముడు ఆత్మహత్య

మిరుదొడ్డి: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని ఓ కుటుంబంలో అన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెనిజులా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి విషమం

కరాకన్‌: వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వూపిరితిత్తుల్లో  తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో చావెజ్‌ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ సమాచార మంత్రి విల్లెగన్‌ తెలిపారు. క్యూబాలో అధ్యక్షుడికి చికిత్స అందిస్తున్న…

నేడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఈరోజు సమావేశం అవుతున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. నెల…

అక్బరుద్దీన్‌ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్‌, నిర్మల్‌ పోలీసులు నోటీసులు  జారీ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన జిల్లా పోలీసులు అక్బరుద్దీన్‌ లేకపోవడంతో బంజారాహిల్స్‌లోని ఆయన  ఇంటికి నోటీసులు అంటించారు.

అఘాయిత్యాలపై 8న రాష్ట్రస్థాయి సదస్సు

జస్టిన్‌ రమణ, జస్టిన్‌ రోహిణి వెల్లడి సికింద్రాబాద్‌: మహిళలపై అత్యాచార కేసుల విచారణకు రాష్ట్రంలో సైతం సత్వర విచారణ న్యాయ స్థానాల (ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ జ్యూడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌…

ఓయూ విద్యార్ధిని హత్యకేసులో నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌:  ఓయూ విద్యార్థిని అరుణ హత్య కేసులో కీలక నిందితుడు శివకుమార్‌ను పోలీసులు పుణెలో ఈ ఉదయం అరెస్టు చేశారు. ఈ కేసులో శివకుమార్‌ సోదరుడు ప్రభు, స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌ను నిన్ననే పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితులు, బంధువుల…

దుబాయ్‌లో దుబ్బాక వాసి మృతి

దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మెదక్‌ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల కిందట గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించలేదు. పర్యాటక…

రేణిగుంటలో ఆకస్మిక తనిఖీలు

రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట తారకరామనగర్‌లో పోలీసులు ఈ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు లాడ్జీలలో సోదాలు నిర్వహించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలక నేతలు ఆంటోనీ సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ తదితరులు చర్చించినట్లు తెలియవచ్చింది.

ఓయూ విద్యార్థుల ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందతులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వరకు ర్యాలీ కొనసాగనుందని విద్యార్ధి నేతలు తెలియజేశారు. ర్యాలీ…