Sunday, 15 November 2026

వార్తలు

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా : గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనే గతంలో తెదేపా సమైక్యవాదాన్ని పక్కనబెట్టి తెరాసతో జట్టుకట్టిందని ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ విమర్శించారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలని  అఖిలపక్షంలో చెప్పానని…

ఢిల్లీలో హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన హెల్ప్‌లైన్‌ అవిష్కరణ కార్యాక్రమం సాయంత్రానికి వాయిదా వపడింది.…

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌పై పోలీసు కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నారంటూ ఆయనపై ధర్మవరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అభియోగాలు నమోదు చేశారు. ఈకేసులో శ్రీరామ్‌తో పాటు పది మందిపై కేసు…

ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణను సీబీఐ కోర్టు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతించవద్దంటూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని పున: పరిశీలించండని గవర్నర్‌ తిప్పింపంపిన విషయం తెలిసిందే.

ఢిల్లీ పోలీసులకు నేడు అందనున్న ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక

న్యూఢిల్లీ :  వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. ఈ కేసులో ఛార్జిషీట్‌ను బుధవారం నాడు దాఖలు చేస్తామని పోలీసులు తెలియజేశారు. ఇది వెయ్యి పేజీల వరకూ ఉండనున్నట్లు చెప్పారు.…

నల్గొండలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

నల్గొండ : ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నియామక పరుగు పరీక్షకు అనుమతించకపోవడానికి నిరసిస్తూ అభ్యర్థులు కలెక్టర్‌ నివాసం ముందు ఆందోళనకు దిగారు. రెండు నెలలలపాటు సాధన చేసినా తమను అనుమంతించకపోవడంపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి…

అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

వరంగల్‌: విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా కృష్ణాకాలనీలోని  ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది ఉపాధ్యాయుడి అసభ్యప్రవర్తన పై విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేశారు.  దీంతో వారంత ఈ ఉదయం పాఠశాలకు…

విద్యార్థిని దారుణ హత్య

కందుకూర్‌ : రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండంల దాసర్లపల్లిలో విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కందుకూరులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిన్న సెలవు కావడంతో వూరికి వచ్చింది. సాయంత్రం పొలం పనులకు వెళ్లిన అమెపై ఎవరూ లేని…

ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్న ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈ మధ్యాహ్నం టీఎన్జీవో భవన్‌లో భేటీ కానుంది. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే వెల్లడించిన నేపథ్యంలో నెల రోజులపాటు అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఐకాస…

నేడు బాధ్యతలు స్వీకరించనున్న సైరస్‌!

ముంబయి: టాటా గ్రైపు కొత్త చైర్మన్‌ సైరన్‌ మిస్త్రీ పదవీబాధ్యతలను నేడు లాంఛ నప్రాయంగా స్వీకరించనున్నారు. ‘ శని. ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ సోమవారం కార్యాలయానికి వస్తారని గ్రూపు ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌ వర్గాలు…