Sunday, 15 November 2026

వార్తలు

మృతురాలి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం ఇవ్వనున్నట్టు…

రేపటి నుంచి 20 జిల్లాల్లో నగదు బదిలీ పథకం : చిదంబరం

న్యూఢిల్లీ : మంగళవారనుంచి దేశంలోని 20 జిల్లాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్ధిక మంత్రి చిదంబరం తెలియజేశారు. ఫిబ్రవరి 1 నాటికి మరో 11 జిల్లాల్లో మార్చి 1 నాటికి మరో 12 జిల్లాల్లో ఈ పథకాన్ని…

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: మజ్లిన్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇతర మతస్థుల అచార వ్యవహారాలను విమర్శించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఖండించారు. అక్బర్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మజ్లిన్‌ గుర్తింపు రద్దు…

అఖిలపక్షంలో ఒకే వైఖరి వెల్లడించాం : బొజ్జల

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము ఒకే వైఖరిని వెల్లడించామని తెలుగుదేశం సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలియజేశారు.

కోటి సంతకాల సేకరణ సిగ్గుచేటు : ముద్దు కృష్ణమనాయుడు

హైదరాబాద్‌: ప్రజాధనం లక్ష కోట్లు దండుకున్న జగన్మోహన్‌రెడ్డి విడుదలకు వైకాపా కోట సంతకాల సేకరణచేపట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. 2004లో లక్షలో ఉన్న జగన్‌ ఆదాయం ఏడేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగిందో ప్రజలకు…

నూతన సంవరత్సర వేడుకలను రద్దుచేసిన సైన్యం

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా సైన్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దుచేశారు. దేశంలొని అన్నీ సైనిక కార్యాలయాలు, కంటోన్మెంట్లలో వేడుకలు రద్దు చేస్తున్నట్టు సైనిక ఉన్నాతాధికారులు ప్రకటించారు. నూతన సంవత్సరం రోజున ప్రధాన సైనికాధికారి…

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి : సుప్రీంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి పిటిషన్‌

హైదరాబాద్‌: దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ప్రమీల శంకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.…

బాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం లక్ష్మీపురంలో చంద్రబాబు పాదయాత్రను మహిళలు అడ్డుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట…

పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు నారాయణపురం జిల్లా దౌడాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్‌ జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

కరీంనగర్‌: ఇంటికి  నిప్పంటుకుని వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మల్యాలలో చోటు చేసుకుంది. వృద్ధుడి సజీవదహనంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.