Sunday, 15 November 2026

వార్తలు

అసమర్థ, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి : హోంమత్రికి తెదేపా లేఖ

న్యూఢిల్లీ : గత 8 ఏళ్లుగా అసమర్థ, అవినీతితో కూడిన పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నయని అఖిలపక్ష భేటీలో హోంమత్రికి ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లేఖలో పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలియజేశారు.…

గ్యాస్‌ సిలిండర్ల దొంగల పట్టివేత : 220 సిలిండర్లు స్వాథీనం

దేవరకొండ : రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గ్యాస్‌ సిలిండర్ల గోదాముల్లో చోరీలకు పాల్పడి సిలిండర్లు దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు  శుక్రవారం పట్టుకున్నారు. వారినుంచి 220 సిలిండర్లు, 5 గ్యాస్‌ స్టవ్‌లు స్వాథీన పరచుకున్నట్లు…

షిండే ప్రకటన శుభపరిణామం : సురేష్‌రెడ్డి

న్యూఢిల్లీ  : తెలంగాణ సమస్య పరిష్కారానికి నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని హోంమత్రి షిండే ప్రకటించడం మంచి పరిణామనని అఖిలపక్ష భేటీ కాంగ్రెస్‌ ప్రతినిధి సురేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారనే తనకు అనిపిస్తోందని భేటీ అనంతరం…

సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలి : గాదె వెంకటరెడ్డి

న్యూఢిల్లీ : సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు కాంగ్రెస్‌ తరపున భేటీకి హాజరైన ప్రతినిధి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి వదిలి వేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయానికి…

ఇది పనికిమాలిన సమావేశం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం తన నాటకాన్ని కొనసాగిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష భేటీపై తమకు సంతృప్తి లేదని.. ఇది పనికిమాలిన సమావేశమని పేర్కొన్నారు. అన్ని…

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపినట్లు భేటీ అనంతరం ఆ…

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ  : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలికాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపినట్లు భేటీ అనంతరం ఆ…

నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. వైకాపా ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదని ఎంఐఎం మాత్రం ఉంటే…

రేపు తెలంగాణ బంద్‌ : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు.

ముగిసిన అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీ ముగిసింది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.