Sunday, 15 November 2026

వార్తలు

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే…

కాంగ్రెస్‌ది దాటవేత ధోరణి : వినోద్‌

న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెరాస నేత వినోద్‌ అన్నారు. తెలంగాణపై ఏదీ చెప్పకుండా కాంగ్రెస్‌ దాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో…

కాంగ్రెస్‌ అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోతోంది? : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభిప్రాయం చెప్పలేకపోతోందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగోనాలని పార్టీ…

కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఆయన నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ,…

నార్త్‌ బ్లాక్‌కు చేరుకుంటున్న ప్రతినిధులు

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీ కి హాజరయ్యేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. 11.30కు హోంమంత్రి షిండే విలేకరుల సమావేశం ఏర్పాటు…

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ 128వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు , పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమే నిర్ణయం తీసుకోవా : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీకి రాసిన లేఖను తెదేపా వెనక్కితీసుకోలేదని అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధిగా హాజరువుతున్న కడియం శ్రీహరి అన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరయ్యేముందు శ్రీహరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది…

భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం : కోదండరాం

న్యూఢిల్లీ: అఖిలపక్ష భేటీ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీదే ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష భేటీలో…

నార్త్‌బ్లాక్‌ ప్రాంగణంలో ఐకాస నేతల ఇందోళన

న్యూఢిల్లీ: హోంమంత్రి కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పలువురు ఐకాస నేతలు భేటీ ప్రారంభయ్యే ముందు నిరసన చేపట్టారు. అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి షిండే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

ఆజాద్‌తో కాంగ్రెస్‌ బృందం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయింది. ఈ బృందంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గాదె వెంకటరెడ్డి,…