Sunday, 15 November 2026

వార్తలు

జనవరి 20న ఏఐసీసీ సమావేశం

న్యూఢిల్లీ: జరిగిన 20న ఏఐసీసీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్దన్‌ ద్వివేది తెలియజేశారు. జనవరి 18 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్‌ చైతన్య శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

కరీంనగర్‌: రామగుండం మండలం లింగాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్‌ చేశారు.

షర్శిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర పేరుతో ఊళ్లోకి రావొద్దంటూ దేవరకద్ర ప్రజలు షర్మిలకు నల్లజెండాలతో నిరసన…

‘ అర్థక్రాంతి’ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: ‘ అర్థక్రాంతి’పై సదస్సు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశంలో పన్నుల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య అధ్యక్షత వహించనున్నారు.

చర్చకు రాకుండా అడ్డుకున్నారు: దాడి

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో రైతుల సమస్యలపై శాసనమండలిలో చర్చకు రాకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు  ఆరోపించారు. నీలం తుపానుపై మండలిలో చర్చ జరుగుతుందని ఆశించిన రైతుల ఆశలకు ముఖ్యమంత్రి గండికోట్టారని ఆయన విమర్శించారు.…

శీతాకాల సమావేశాల్లో … ప్రజా సమస్యలపై చర్చించాలి : రాఘవులు

మెదక్‌ : విధానసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక క్రీమీ లేయర్‌ అమలు చేయాలని అయన డిమాండ్‌ చేశారు.…

మావోయిస్టులకు ఆయుధాలిస్తున్న స్మగ్లర్ల అరెస్ట్‌

ముంగేర్‌: విధ్వంసకాండను సృష్టించేందుకు గాను మావోయిస్ట్‌లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సమాకూర్చుతున్న ఇద్దరు ఆయుధ స్మగ్లర్లు అరెస్ట్‌ అయ్యారు. బీహార్‌ రాష్ట్రంలోని ముంగేర్‌ జిల్లాలో పోలీసులు శనివారం వీరిని అదుపులోకి  తీసుకున్నారు. ఈ ఆయుధ స్మగ్లర్ల అక్రమాలపై విశ్వసనీయ…

ఉప ప్రణాళిక పై ఓయూలో విద్యార్థుల హర్షం

హైదారాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహాకు విద్యార్థులు అభింనందనలు తెలిపారు. ఆర్ట్స్‌…

మాట తప్పితే ‘ఛలో అసెంబ్లీ ‘ : కోదండరాం

హైదరాబాద్‌: డిసెంబర్‌ 10 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణపై  తీర్మానం చేయాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. నోమా ఫంక్షన్‌ హాల్‌లో జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ…

కేజ్రీవాల్‌ అభ్యర్థులకు ప్రచారం :అన్నా హజార్‌

భువనేశ్వర్‌: సామాజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ నెలకొల్పిన ‘ ఆమ్‌ ఆద్మీ’ పార్టీ తరపు అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే తెలియజేశారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుకు తాను ప్రచారం చేయబోనని…