Saturday, 14 November 2026

వార్తలు

జిల్లాలకు తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించిన పీసీసీ

హైదరాబాద్‌: ఆరు జిల్లాలు, 3 నగరాలకు పీసీసీ పార్టీ తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించింది. భూపాల్‌రెడ్డి – మెదక్‌, నరేంద్రయాదవ్‌- శ్రీకాకుళం , కరుణం ధర్మశ్రీ- విశాఖ, రాజశేఖరరెడ్డి-చిత్తూరు. మల్లికార్జునరావు-గుంటూరు, దొంతి మాధవరెడ్డి- వరంగల్‌ జిల్లాలకు, అడపా నాగేంద్రప్రసాద్‌- విజయవాడ,…

ఇరాక్‌లో కారు బాంబు పేలుడు: 27 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో కారు బాంబు పేలిన దుర్ఘటనలో 27 మంది మృత్యువాత పడ్డారు. బాగ్దాద్‌లోని ఆర్మీ దళం కేంద్రానికి సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం, గాయపడిన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

తెరాస మేధోమథన సదస్సు ప్రారంభం

కరీంనగర్‌: రెండు రోజుల పాటు జరిగే తెరాస మేధోమధన  సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమయింది, ఈసదస్సుకు తెరాస అధినేత కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.

మరో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ సమర శంఖం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శత విధాల ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఉద్యమానికి సమర శంఖం పూరించారు. పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యంనింపి ఉద్యమ దిశగా నడిపించేందుకు కరీంనగర్‌లో మేధోమథన సదస్సు ప్రారంభించారు. 10 జిల్లానుంచి…

ఒబామాకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఢిల్లీ: నల్లసూరీడు బరాక్‌ ఒబామా తెల్లకోటలో మళ్లీ పాగవేయడంపై భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుపొందిన బరాక్‌ ఒబామాకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.31,100 పలుకగా,22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,820 గా ఉంది. కిలో వెండి ధర…

ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలి: డీజీపీ

హైదరాబాద్‌: ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని డీజీపీ దినేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతల సంరక్షణకు పౌరులు సహకరించాలని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించవద్దని ఆయన సూచించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

దౌలతాబాద్‌ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్‌ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.    

ఐటీ పరిశ్రమకు శుభవార్త కాదు : ఐగేట్‌ సీఈఓ

బెంగుళూరు : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బరాక్‌ ఒబామా విజయం ఐటీ ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమకు శుభవార్త కాదని ఐగేట్‌ సీఈఓ ఫణీష్‌ మూర్తి తెలిపారు. అమెరికాలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెడతానన్న ఒబామా ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని తన ఎన్నికల…

భారతీ ఎయిర్‌టెల్‌ నికరలాభంలో తగ్గుదల

ముంబయి : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ నికరలాభం 29.7 శాతం తగ్గింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో గత ఏడాది 1.027 కోట్ల నికరలాభం చూపిన సంస్థ ఈ ఏడాది 29.7 శాతం తగ్గుదలతోరూ. 721.2 కోట్లు చూపింది. అయితే…