Saturday, 14 November 2026

వార్తలు

స్థిరంగా ఉపరితల ఆవర్తనద్రోణి

విశాఖపట్నం : రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖలోని వాతాఆరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల మామూలు స్థాయిలోను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

2014 వరకు సీఎంను మార్చం: వాయలార్‌

ఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని కేంద్రమంత్రి , ఏఐసీసీ ప్రతినిధి వాయలార్‌ రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పిస్తారని వస్తున్న వార్తలను వాయలార్‌ రవి తోసిపుచ్చారు. సోనియా, ఆజాద్‌ల ముందు సీఎం మార్పు…

తెలంగాణలో పంటనష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందపి తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఏడాదిన్నర కిందిట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎమిటో తెలుస్తోందని తెలంగాణ భవన్‌లో  మీడియాతో మాట్లాడుతూ అన్నారు.…

తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉంది: షిండే

న్యూఢిల్లీ: దేశానికి తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ముంబయి. దాడుల కేసులో కీలక నిందితులు పొరుగు దేశంలో ఉన్నారని అందరికీ తెలుసునని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు

కర్నూలు: వెంగన్నబావి వద్ద నకిలీ విత్తనాల తయారీని విజిలెన్స్‌ అధికారులు గుట్టురట్టు చేశారు. విత్తన గోదాముల్లో తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. గోదాముల నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

పంట నష్టపరిహారం కోసం టీఆర్‌ఎస్‌ ధర్నా

నల్లగొండ: నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లంచాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ధర్నా చేస్తున్నారు. ఎకరలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.

అత్యాచారం ఘటనలో నిందితుడి వూహాచిత్రం విడుదల

ముంబయి: విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అనుమానితుడి వూహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాంద్రాలో ఉంటున్న ఓ స్పానిష్‌ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం విలువైన…

వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయింది: రఘువీరారెడ్డి

విజయవాడ: ఈశాన్య రుతుపవానలకు సంబంధించి వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయిందని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నీటమునిగిన పొలాలను కలెక్టర్‌ బుద్దప్రకాష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలను…

బలహీనపడిన అల్పపీడనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అవరించి ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతవారణ శాఖ తెలిపింది, వీటి ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలియజేశారు.

నగల దుకాణంలో చోరీ

పెదపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీథిలోని వరలక్ష్మి నగల దుకాణంలో చోరీ జరిగింది, నిన్న రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 13 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం నగలను దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని…