Saturday, 14 November 2026

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖ: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వానలు, ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు…

విజయవాడకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంషాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరివెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు బొత్స, పితాని,కన్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.వాతావరణ అనుకూలించకపోవడంతో కాసేపు శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం వేచి ఉన్నారు. ఏటీసీ…

కరకగూడేంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్‌ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, అదుపులో ఉన్న మావోయిస్టు సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల…

సీఎం ఏరియల్‌ సర్వే అలస్యం

హైదరాబాద్‌: ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వూకు వెళ్లనున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన అలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వేచి ఉన్నారు.

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

వాపింగ్టన్‌: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక సంబంధించి పోలింగ్‌ ఇవాళ జరగనుంది, అధ్యక్షస్థానానికి ప్రస్తుత అధ్యక్షడు బరాక్‌ ఒబమా, మిట్‌రోమ్ని తలపడుతున్నారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది.

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 10 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

లక్ష హెక్టర్లలో దెబ్బతిన్న పంటలు

కృష్ణా: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలో 1,06,169 హెక్టార్లలో వరి,పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, భారీ వర్షాల కారణంగా జిల్లా రహదారులకు రూ.132 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరద ఉద్థృతి తగ్గకపోవడంతో విజయవాడలో…

పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

విజయనగరం: జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టామి, దీంతో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.

మద్దతుదారులతో నేడు యడ్యూరప్ప భేటీ

బెంగళూరు: భాజపాను వీడి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. బెంగళూరులోని డాలర్‌ కాలనీ నివాసంలో విందు భేటీకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఆహ్వానం పంపారు.…

విశాఖ నుంచి గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ యథాతథం

విశాఖ: విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గరీభ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రోజు యధావిధిగా నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు.…