Saturday, 14 November 2026

వార్తలు

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు  వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డీ1 బోగీలోని పలు ఫ్యాన్ల నుంచి స్వల్పంగా మంటలు, పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్‌ లాగి రైలును ఆపివేశారు. చర్లపల్లి సమీపంలో రైలును నిలిపి 25 నిమిషాలపాటు…

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: కిషన్‌రెడ్డి

రాజమండ్రి: వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. నీలం తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి…

ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. పలు జిల్లాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో నేడు ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేయనున్నారు.

ఒబామా, రోమ్నీల హోరా హోరీ

సర్వేకు చిక్కని ఓటరు నాడి నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అభ్యర్థి…

కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర సర్కార్‌ మరోమారు వివక్ష చూపింది. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.25 లక్షలు మాత్రమే కేటాయించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాయల ఉత్సవాలకు వంద…

సీనియర్‌ జర్నలీస్టు డి. సీతారాం కన్నుమూత

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం ఇకలేరు. ఆయన ఇవాళ కన్నుమూశారు. సీతారాం దిహన్స్‌ ఇండియా కాలమిస్టుగా , ఏఎస్‌ఐ ఎడిటోరియల్‌ చీఫ్‌గా పనిచేశారు. సీతారాం నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌ కు చెందినవారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి…

ఉక్కు మహిళ దీక్షకు 12 ఏళ్లు

మణిపూర్‌ నవంబర్‌ 5 (జనంసాక్షి) మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ చేపట్టిన నిరధిక దాక్షకు సోమవారానికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.ముక్కుద్వారా ఆమెకు ఆహారం ఎక్కించి సజీవంగా…

సోనియాతో కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతల భేటీ

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని మార్చొద్దని వీరు విన్నవించినట్లు తెలుస్తోంది. సోనియాతో రాష్ట్ర…

తెలంగాణ కోసమే కేసీఆర్‌తో చర్చలు

తెలంగాణ రాష్ట్రం కోసమే తమ పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారని  కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, మేం అందుకు కృషి…

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో టీ నేతల భేటీ

తెలంగాణ రాష్ట్రం ప్రకటించండి కిరణ్‌పాలన భేష్‌ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని మార్చొద్దని విన్నపం న్యూడిల్లీ : ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ని మార్చవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మేల్యేలు కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌…