Saturday, 14 November 2026

వార్తలు

ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలు

చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి.ఈ సమాశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.జాతీయ భద్రత విషయంలో సమగ్రమైన విదానాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.బిజేపి అద్యక్షుడిగా గడ్కరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సమావేశం అబిప్రాయపడింది.సమస్యలను…

తల్లాడ చేరిన సాగునీటిసాధన యాత్ర

ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు  ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.

చిరును సన్మానించనున్న సిని ఇండస్ట్రీ.?

హైదరాబాద్‌: చిరంజీవి పర్యాటక శాక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవిపై సినీ ఇండస్ట్రీలో ఆయన వైరి వర్గం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్‌ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు  సమాచారం. ఐతే సినిమాల్లో ఉన్నప్పుడు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు పిస్టల్‌తో బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం :సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ తీర్మాణానానికైనా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిల్లర వర్తకం, బీమా, పింఛన్లు లాంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు తాము వ్యతిరేకమని అన్నారు. పార్టీ…

రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: భారీ వర్షాలతో రైల్వేలైను దెబ్బతినడం మూలంగా పలుచోట్ల నిలిచిపోయిన రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. చీరాల వద్ద ఉన్న  అలెప్పిధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ వద్ద నిలిచిపోయిన నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నిడదవోలు వద్ద ఉన్న యశ్వంత్‌పూర్‌-హతియా ఎక్స్‌ప్రెస్‌లను నాగపూర్‌,…

వర్షాల వల్ల 17 మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల 17 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రకటించింది, జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగుతున్నాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ…

రాష్ట్రం అతలాకుతలమవుతోంటే మంత్రులు ఢిల్లీకి వెళ్తారా? తెదేపా నేతల ప్రశ్న

హైదరాబాద్‌: తేపానుతో కోస్తాంధ్ర అతలాకుతలం అవుతుంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని తెదేపా ప్రశ్నించింది. చేతికి వచ్చిన పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు బొజ్జల, మండవ వెంకటేశ్వరరావులు…

పురపాలక ఎన్నికలపై చర్చిస్తున్నాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలను ఏ (2001 లేదా 2011) జనాభా లెక్కల ప్రకారం జరపాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. 2011 జనాభా…