Saturday, 14 November 2026

వార్తలు

‘నీలం ‘ ప్రభావంపై మంత్రి తఘువీరా సమీక్ష

హైదరాబాద్‌ : (సచీవాలయం) : నీలం తుఫాను ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 77 వేల హెక్టార్లలో పంట నీట మునీగిందని. పంటనష్టం అంచనాపై నివేదిక పంపమని కలెక్టర్లను అదేశించినట్లు అయన తెలిపారు.నీలం తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా…

తప్పు చేసిన వారు శిక్షార్హులే : అర్‌ ఎన్‌ ఎన్‌

ఢిల్లీ : అవినీతి అరోపణలకు సంబంధించి అర్‌ఎన్‌ఎన్‌ గడ్కరీని వెనకేసుకోచ్చింది.చట్ట ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, అక్రమ భూకేటాయింపు లేదా అవినీతి ఏదైనా తప్పు తప్పే అని నేతలు వ్యాఖ్యనించారు. దర్యాప్తు అనంతరమే నిజాలు తేలతాయన్నారు.…

శాసన సభ పక్ష కార్యాలయంలో నేతలు నివాళులు

హైదరాబాద్‌ : తెదెపా శాసనసభ పక్ష కార్యాలయంలో ఎర్రన్నాయుడు  చిత్రపటానికి తెదేపా నేతలు నివాళులర్పించారు.అయన మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యేలు లింగారెడ్డి,రామారావు అన్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణం తీవ్రదిగ్బ్రాంతికి గురిచేసిందని, రాజకీయల్లో మంచి విలువలు, సిద్దాంతాలు పాటించిన…

తెలంగాణ అంశంపై కోనసాగుతున్న చర్చలు : షిండే

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై ఎంపీలతో చర్చలు కోనసాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఈ సమస్యని కాలమే పరిష్కరిస్తుందన్నారు. అఖిలపక్ష సమావేశంపై చంద్రబాబు లేఖ రాసిన విషమం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

గనుల విలీనాన్ని నిలిపివేయాలి

గోదావరిఖని : సింగరేణి జీడీకే 2, 2 ఏ బోగ్గు గనుల విలినం చేయవద్దని హెచ్‌ ఎంఎన్‌ నేతలు గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. వీటిని వేర్వేరుగానే నిర్వహించాలని… విడివిడిగా ప్రత్యేకాధికారులను నియమించాలని కోరారు. ఓకే అధికారి ఉండటంతో…

ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు అపహరణ

జార్ఖంఢ్‌: ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌లో అపహరణకు గురయినట్లు పోలిసులకు ఫిర్యాదు అందింది. జార్ఖండ్‌లోని సాహెభ్‌గంజ్‌ బరాత్‌ రోడ్డులో గురువారం రాత్రి 10.30 గంటలకు చల్లా శ్రీనివాసరావును అపహరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని సాహెబ్‌గంజ్‌…

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో నిన్నటి నుంచి ఎడతెరవు లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. సంతోష్‌నగర్‌, చంపాపేట్‌లో లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహాదారులన్నింటిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

ఎర్రంనాయుడు మృతికి పళ్లంరాజు , అజాద్‌ల సంతాపం

ఢీల్లీ : ఎర్రన్నాయుడు అకస్మిక మృతి పట్ల కేంద్రమంత్రులు పళ్లంరాజు, గులాంనభీ అజాద్‌లు సంతాపం తెలిపారు. ఎర్రన్నాయుడు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మృతి రాజకీయ వ్యవస్థకు తీరని లోటని గులాంనబీ అజాద్‌ అన్నారు.

రాష్ట్రంలో 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం : రాగల 24 గంటల్లో రాాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం స్థిరంగా కోనసాగుతుంది. ఇదిక్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం…

సిద్దిపేట మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యం

మెదక్‌: సిద్ధిపేట మార్కెట్‌యార్డ్‌లో 8 వేల బస్తాల మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోంది. దీంతో వ్యాపారులు కొనడానికి తిరస్కరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వర్షంలో ఆందోళన చేస్తున్నారు.