Friday, 13 November 2026

వార్తలు

పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కరీంనగర్‌ మండలం కొత్తపల్లిలోని ఆల్ఫోర్‌ ఈ-టెక్నో పాఠశాలలో…

ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

చిత్తూరు: రామచంద్రాపురం మండలం ఎన్‌,ఆర్‌.కమ్మపల్లి వద్ద ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను  తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశమయ్యారు.

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంథీ అల్లుడు…

మనీలాలో స్వల్ప భూకంపం

మనీలా: ఫిలిఫిన్స్‌ రాజధాని మనీలా స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైంది. ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అక్కడక్కడ భవంతులు కదిలినట్లు సమాచారం

శాండీ తుపాను బీభత్సం..45కు చేరిన మృతుల సంఖ్య

న్యూయార్క్‌: ‘శాండీ’ తుపాను అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను దాటికి ఇప్పటి వరకై వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరింది. న్యూయార్క్‌ ప్రాంతంలోనే 18 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు శాండీ…

సీఎం పర్యటన నేపథ్యంలో సంగారెడ్డిలో పలు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడో రోజు ఇందిరమ్మ పర్యటనలో భాగంగా నేడు సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో, భాగంగా పోలీసులు సంగారెడ్డిలో పలు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 26 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా లాభంతొ కొనసాగుతోంది.

జూట్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

విజయనగరం: పట్టణంలోని వీటి అగ్రహారంలో ఉన్న ఓ జూట్‌ మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

సీఆర్‌ఆర్‌ తగ్గింపు.. రెపో రేటు యథాతథం

ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబయి, అక్టోబర్‌ 30(జనంసాక్షి): నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్‌) 25బేసిక్‌ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు ఆయన రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్ష అనంతరం పై…