Friday, 13 November 2026

వార్తలు

‘సాండీ’ బీభత్సం..

ఎమర్జెన్సీ ప్రకటించుకున్న అమెరికా అగ్రరాజ్యం అతలాకుతలం చీకట్లో పన్నెండు రాష్ట్రాలు 12 వేల విమానాల రద్దు.. న్యూయార్క్‌, అక్టోబర్‌ 30: సూపర్‌స్టార్మ్‌ ‘సాండీ’ అమెరికా తూర్పు తీరంపై విరుచుకుపడింది. తీర ప్రాంతంలోని 12 రాష్టాల్ల్రో బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్య…

ఆహార ధాన్యాల రాయితీ నేరుగా లభ్ధిదారుల ఖాతాల్లో జమ:మాంటెక్‌సింగ్‌

ఢిల్లీ: ఆహార ధాన్యాలకిచ్చే రాయితీని సరాసరి లభ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా మంగళవారం చెప్పారు. ఆహారశాఖ మంత్రి కె.వి థామస్‌ కూడా ఈ యోచనను సమర్ధించారు.

మంత్రి విశ్వరూప్‌ వైఖరిపై ముమ్మడివరం ఎమ్మెల్యే ఫైర్‌

కాకినాడ: మంత్రి విశ్వరూప్‌ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముమ్మడివరం శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌ నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం నిలుపుదలపై ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆధునిక పద్ధతెల్లో మన భాషలను కాపాడుకోవాలి:రాష్ట్రపతి

తిరువనంతపురం: భారతీయ భాషలను, వాటి సాంస్కృతిక గొప్పతనాన్ని భద్రంగా భావితరాలకు అందించేందుకు ఆధునిక పద్ధతులను వినియోగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ‘అద్వితీయమైన మన భాషలను పరిరక్షించటానికి ప్రస్తుతం అందుబాటులోఉన్న అన్ని ఆధునిక పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఎంతైన…

2008 గ్రూప్‌2 ఫలితాలను విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌: 2008 గ్రూప్‌2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ ఇవ్వకపోతే యద్ధమే: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక కేంద్రంపై యుద్ధమేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలియజేశారు. తెలంగాణ ఇస్తే సంబురం ఇవ్వకపోతే సమరమేనని ఎప్పుడో చెప్పినమన్నారు. నవంబర్‌ 6న కరీంనగర్‌లో పూర్తిస్థాయిలో మాట్లాడుకోని అన్ని విషయాలు తెలుపుతామన్నారు. ఢిల్లీలోతనతో కాంగ్రెస్‌…

నవంబరు 1న విద్రోహదినం: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబరు 1న విద్రోహదినంగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ప్రకటించారు, తెలంగాణ వస్తే సంతోషమని లేకుంటే యుద్ధమేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రణాళికపై మేథోమథన సదస్సులో చర్చించనున్నామని ఆయన…

ట్రాక్టర్‌ బోల్తా : ఆరుగురు మృతి

అనంతపురం: జిల్లా మడకశిర మండలం ఉబ్బిడిపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కర్ణాటకలోని  వెంకటాపురంకు చెందినవారు. మడకశిరతోని గరిమి దేవాలయానికి వచ్చి తికిగి వెళతుండగా…

ఢిల్లీని వణికిస్తోన్న డెంగీ

ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన డెంగీ  బాధితుల సంఖ్య 985కు చేరింది,

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశం

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. విజయదశమి నుంచి ఇప్పటివరకు నగరంలో జరుగుతున్న ఘటనలపై ఆయన అధికారులతో చర్చించారు.